బాబాయే కాదు.. పవన్ నాకు అంతకు మించి.. చరణ్ భావోద్వేగం..!

- Advertisement -

తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారికి ఒకరిపట్ల మరొకరికి ఎంత అభిమానం ఉందో పలు సందర్భాల్లో వెల్లడైంది. తాజాగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడాడు. నిన్న రాత్రి జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం మొదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదటి ఎపిసోడ్ కి పార్టిసిపెంట్ గా రామ్ చరణ్ హాజరయ్యారు. ఇద్దరు సమకాలీన హీరోలు ఒక చోట కూర్చొని సాగిన ఈ ప్రోగ్రాం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది.

హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్ ఒక ప్రశ్నలో భాగంగా జానీ మూవీ లో పవన్ కళ్యాణ్ పాడిన పాట ఆడియో క్లిప్ వినిపించారు. చరణ్ వెంటనే గుర్తించి బాబాయ్ పవన్ కళ్యాణ్ పాడిన పాట అని సమాధానం చెప్పాడు. ఈ సందర్భంగా బాబాయ్ తో తనకున్న అనుబంధం గురించి చెబుతూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. ‘ నేను చదువుకునే రోజుల్లో నాన్న బిజీగా ఉండేవారు. ఆ సమయంలో బాబాయ్ నాకు ఒక ఫ్రెండ్ గా, తండ్రి స్థానంలో ఉండి అన్నీ తానై చూసుకునే వాడు. తమ చదువులు దగ్గరనుంచి వ్యక్తిగత విషయాల వరకు అన్నీ ఆయన చూసుకునేవాడు. మా నాన్న మాతో పంచుకోలేని విషయాలను కూడా బాబాయ్ తో చెప్పించేవారు’ అని చరణ్ ఎమోషనల్ గా చెప్పాడు. చరణ్ మాటలు విన్న ఎన్టీఆర్ మీ ఇద్దరి మధ్య బంధం ఇలాగే బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

కార్యక్రమం కొనసాగుతుండగా వీడియో లో లైవ్ లో రానా ఎంట్రీ ఇవ్వడంతో ఈ షో మరింత రక్తి కట్టింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ ని మూడేళ్లుగా తీస్తున్న రాజమౌళిపై ఈ ముగ్గురు హీరోలు సెటైర్లు వేసి సందడి చేశారు. అలాగే రాజమౌళి గొప్పతనం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ కు భారీగా రెస్పాన్స్ రావడంతో నిర్వాహకులు సంతోషంగా ఉన్నారు.

Also Read: తమకంటే పెద్దవారిని పెళ్లి చేసుకున్న సెలబ్రిటీస్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -