Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో!

- Advertisement -
akkineni hero big shock to pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అక్కినేని హీరో పెద్ద షాక్ ఇచ్చాడు. పవన్ ఫ్యాన్స్ కు సారీ చెబుతూనే షాక్ ఇచ్చాడు. మ‌రి ప‌వ‌న్‌కే షాక్ ఇచ్చిన ఆ అక్కినేని హీరో ఎవ‌రో ..? ప‌వ‌న్‌కు ఎందుకు షాక్ ఇచ్చాడు ? అసలు ఆ సంగతి ఏంటో చూద్దాం… చాలా గ్యాప్ తీసుకొని అక్కినేని సుమంత్ నరుడా డోనరుడా అనే సినిమా చేశాడు.

ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో సుమంత్ సోషల్ మీడియాలో తన అభిమానులతో చాట్ చేశాడు. అయితే ఈ నెపథ్యంలో సుమంత్‌ను కొంద‌రు అభిమానులు … మీరు ప‌వ‌ర్ స్టార ప‌వ‌న్ లేదా ప్రిన్స్ మ‌హేష్ బాబుల‌లో ఎవ‌రికి ఓటేస్తార‌ని ప్ర‌శ్నించారు. ఆ ప్రశ్నలకు స్పందించిన సుమంత్ పవన్ అభిమానులకు సారీ చెబుతూ.. మహేష్ బాబు అభిమానులను సంతోష పెట్టే ఆన్సర్ ఇచ్చాడు. ’ నా అభిమాన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు… సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్’ అని తడుముకోకుండా ఆన్సర్ చెప్పేశాడు.

అయితే.. సుమంత్, మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక, అభిమానులు ఆన్‌లైన్ లోనే సుమంత్ ను మరో ఆసక్తికర ప్రశ్న అడిగారు. పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే… దీనికి సుమంత్ మరింత కొంటెగా ప్రశ్నించాడు. “నేను అందరి పెళ్లిళ్లకూ వెళ్తానే తప్ప, నా పెళ్లికి వెళ్లను” అంటూ తాను పెళ్లి చేసుకోనన్న విషయాన్ని చమత్కారంగా చెప్పాడు. సుమంత్ కు గతంలోనే తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డితో పెళ్లయ్యింది. అయితే అయిన కొద్ది వీరు వీడిపోయారు.

Related

  1. పవన్ తో అలాంటివి వద్దు!
  2. పవన్ కాట‌మ‌రాయుడు లో మెగాస్టార్!
  3. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు అతిధిగా పవన్
  4. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -