Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్ కాట‌మ‌రాయుడు లో మెగాస్టార్!

- Advertisement -
megastar in katamarayudu

పవవ్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాట‌మ‌రాయుడు అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కాట‌మ‌రాయుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్నాడా ? అని షాక్ అవ్వకండి. అసలు విషయం వేరే ఉంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కాట‌మ‌రాయుడు కోసం వేసిన ఓ సెట్‌ను మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా కోసం వాడుకుంటున్నార‌ట‌. కాట‌మ‌రాయుడు చిత్రం కోసం ఓ అందమైన సెట్ నిర్మించారు. ఇప్పుడు అదే సెట్ ను చిరు ఖైదీ నెం 150 సినిమా కోసం వాడుతున్నారు.

రెండు మూడు రోజుల పాటు ఇదే సెట్‌లో షూటింగ్ చేస్తార‌ని చిత్ర బృందం స్ప‌ష్టం చేసింది. ఖైదీ నెంబర్ 150 సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుదల తేదికు సమయం తక్కువగా ఉండటంతో ఇప్పటికిప్పుడు ఓ సెట్ వేయాలంటే మ‌ళ్లీ కొంత స‌మ‌యం ప‌డుతుంది కాబ‌ట్టి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ సలహాతో కాటమరాయుడు సెట్ లో షూటింగ్ చేశార‌ని తెలిసింది. ఈ సినిమాలో చిరు పక్కన హీరోయిన్ గా కాజల్ ను తీసుకోవడం, ఆలీని కూడా ఓ కీలకపాత్రకు తీసుకోవడం వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Related

  1. చిరు ఎంట్రీ ఇస్తుంటే .. పవన్ ఎగ్జిట్ కానున్నాడా..?
  2. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియోకు అతిధిగా పవన్
  3. పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!
  4. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -