Thursday, May 9, 2024
- Advertisement -

టీవీ నటి ప్రత్యూషను వ్యభిచారం చేయాలని…?

- Advertisement -
the young bride in the case of prostitution twist

‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య గురించి అందరికి తెలిసిందే. ఈ ఆత్మహత్య టెలివిజన్ ప్రపంచాన్ని షాక్‌లోకి దింపింది. ప్రత్యూష లవర్ రాహుల్రాజ్ సింగ్ వేధింపులు తట్టుకోలేకే ఏప్రిల్లో గోరెగావ్లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్న అనుమానాలు ముందునుంచి ఉన్నాయి. అయితే తాజాగా ఆమె ఆత్మ‌హ‌త్య గొడవలో మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అయితే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య సంఘటనపై ‘ముంబై మిర్రర్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రత్యూష మాట్లాడిన చివరి ఫోన్ కాల్స్ ఆధారంగా ప్రత్యూష బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ ఆమెపై వ్య‌భిచారం చేయాల‌ని ఒత్తిడి చేసిన‌ట్టు ఆ క‌థ‌నం తెలిపింది. ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య‌కు ముందు రాహుల్‌కు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా అత‌డు ఆమెను ఎలా హింసించాడో తెలుస్తోంది. చివ‌రి మూడు నిమిషాల ఫోన్ కాల్స్ చూస్తే ప్రత్యూష ఏడుస్తూ అతడితో మాట్లాడిన మాటలివే. ‘నీచుడా, నా జీవితంలో అన్నింటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు.

నా కెరీర్ కోసం, నటించడానికి పరిశ్రమకు వచ్చాను. కానీ నువ్వు నన్ను వ్యభిచారిణిగా మార్చేశావ్. రాహుల్.. నువ్వు చేసిన పనికి నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. నువ్వు స్వార్థపరుడివి. నా పేరు చెడగొట్టావ్. నా గరించి, నా తల్లిదండ్రుల గురించి సమాజం తప్పుగా మాట్లాడుకుంటోంది. అంతా అయిపోయింది. నా పని అయిపోయింది.. నేనిక లేను” అని ప్రత్యూష మాట్లాడినట్లు తెలుస్తోంది. “ఆ ఫోన్ కాల్స్ సంభాషణలు అన్నీ ప్రత్యూష మరణానికి కొంచెం ముందుగా జరిగినవి. వాటి ప్రకారం ప్రత్యూష చేత వ్యభిచారం చేయించాలని రాహుల్ ప్రయత్నించాడని స్పష్టం అవుతోంది.’ అని తెలుస్తోంది. అయితే రాహుల్ మాత్రం ప్ర‌త్యూష త‌ల్లిదండ్రులే డబ్బుల కోసం ఆమెను చిత్రహింసలు పెట్టినట్టు చెబుతున్నాడు. అయితే రాహుల్ ఫోన్ కాల్స్ ప్రకారం… మాత్రం ప్రత్యూష మానసికంగా చిత్రవధ చేసి.. ఆత్మహత్యకు పురి కొల్పాడని.. తెలుస్తోంది.

Related

  1. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!
  2. పవన్ తో అలాంటివి వద్దు!
  3. యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!
  4. వామ్మో.. ఇలియానాకు అంత వయసు ఉంటుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -