Saturday, May 25, 2024
- Advertisement -

అక్కినేని హీరో స్వంత బ్యానర్

- Advertisement -

సుమంత్ అక్కినేని , అక్కినేని ఫ్యామిలీ లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అని పేరు అయితే ఉంది కానీ నిలదొక్కుకునే స్థాయి లో సినిమాలు చేయలేక పోయాడు. ఈ మధ్య ఫేస్ బుక్ లో ఒక వీడియో ని పెట్టాడు సుమంత్. తానూ స్వతహా గా ఒక ఇంట్రోవెర్ట్ ని అని చెప్పిన అతను అందులోంచి బయటపడుతున్నా అంటూ ప్రకటించాడు. 

తన సొంత బ్యానర్ త్వరలో రాబోతోంది అని దాని మీద సినిమాలు తీస్తాను అని తెలిపాడు సుమంత్. ప్రోగ్రెసివ్ గా ఉంటూ నే పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తా అంటున్నాడు. అలాగే నటన కి తాను ఇంకా గుడ్ బై చెప్పలేదు అని వీలు దొరికినప్పుడల్లా కెమెరా ముందు మెరుస్తా అంటున్నాడు. 

ఈ ప్రకటనతో సుమంత్ ఇక నుంచి కొత్త శాఖలో అడుగుపెట్టినట్టే. నటుడిగా నిలదొక్కుకోలేకపోయినా.. మావయ్య నాగార్జున ఇన్ స్పిరేషన్ తో నిర్మాతగా అయినా నిలదొక్కుకుంటాడేమో చూడాలి. 

అక్కినేని నాగార్జున హీరోగా ఎంత పెద్ద సక్సెస్ అయ్యాడో నిర్మాతగానూ అంతే పెద్ద సక్సెస్ అయ్యారు. ఏ విభాగం చేపట్టినా అందులో విజేతగా నిలిచాడు. సుమంత్ నిర్మాతగా భవిష్యత్ ని మలుచుకోవాలని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -