Saturday, May 18, 2024
- Advertisement -

తెలుగుదేశాన్ని వణికిస్తున్న కొత్త సెంటిమెంట్ – ఎంత మంది అవుట్ అవుతారు ?

- Advertisement -

రాజకీయ సమీకరణాలు, రాజకీయ ఎత్తుగడలూ, డబ్బూ ఇలాంటి వాటికంటే రాజకీయాలలో చాలా సార్లు సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. అనుకున్న రాతల్ని తారుమారు చేసే సత్తా సెంటిమెంట్ కి ఉన్నట్టుగా దేనికీ లేదు మరి. ఇప్పుడు తెదేపా ఎంపీ గుండు సుధారాణి టీడీపీ కి గండి పొడిచి మరీ తెరాస లోకి వెళ్ళడం వెనక ఇలాంటి భారీ సెంటిమెంట్ ఒకటి టీడీపీ లో కొత్తగా రేగుతోంది.

సాధారణ కార్పొరేటర్గా ఉన్నటువంటి మరియు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి నాయకురాలిని ఏకంగా రాజ్యసభ ఎంపీగా ఉన్నత పదవిలోకి పంపిస్తే.. తీరా ఇప్పుడు పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఈ విధంగా విడిపోవడం వెనక తెదేపా శ్రేణులు కోపం కట్టలు తెంచుకుంది. 

ఈమె వెళ్ళిపోవడం వల్ల వచ్చే నష్టంతో పాటు సరికొత్తగా మరొక ఇబ్బంది కనిపిస్తోంది. పార్టీ లో వారి స్థాయి ని పక్కన పెట్టి అడ్డంగా నిర్ణయం తీసేసుకుని కొందరిని రాజ్యసభకి నామినేట్ చేసిన పలువురు నాయకులు ఆ తరవాతి కాలంలో పార్టీ ని వదిలిపోయారు అనే సంగతి ప్రచారం లో సాగింది. తెలుగు దేశంలో రాజ్యసభ ఎంపీలు గా వారు అవతరించి తమ రేంజ్ ని అట్టహాసం గా పెంచేసుకుని కొన్నాళ్ళ తరవాత ఎక్కడ ఫ్యూచర్ అదిరిపోతుంది అనిపిస్తే అటువైపు దూకడం మామూలు అయిపొయింది అని అంటున్నారు. ఇదేదో కాకి కహానీ కాదు టీడీపీ లో ఇప్పటికే పదిహేను మంది దాకా ఇలా రాజ్యసభ ఎంపీ పదవి పొందిన తరవాత పార్టీని వీదిపోయారు. 

ఉదాహరణ కి కాంగ్రెసులో ఉన్న రేణుకాచౌదరి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సి.రామచంద్రయ్య, వంగా గీత, వైకాపాలో ఉన్న మైసూరా రెడ్డి, తెరాసలోకి వెళ్తున్న గుండు సుధారాణి, తటస్థంగా ఉన్న మోహన్బాబు తదితరులు అందరూ లెక్క తేలుతున్నారు. పార్టీ వారికి ఉచిత స్థానం ఇచ్చి టికెట్ ఇచ్చి ఎంపీ ని చేస్తే వారు తిరిగి పార్టీ మీదే పోటీ చేసే స్థితికి రావడం మింగుడుపడని విషయంగా చెప్పాలి.తెదేపా ద్వారా రాజ్యసభ ఎంపీ పదవులు దక్కించుకుంటే చాలు.. ఆ పదవి ముగిసేలోగా చటుక్కున జంప్చేసేస్తారని కొత్త సెంటిమెంట్ ఆ పార్టీలో మొదలైంది. ఇదే నిజం అయితే సుజనా చౌదరి, సీ ఎం రమేష్ లాంటి వారు కూడా త్వరలో జంప్ జిలానీ అనుకోవాలి ఏమో !

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -