Friday, May 3, 2024
- Advertisement -

మ‌రో మ‌ల్టీస్టారర్‌లో నాగ్‌

- Advertisement -

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కింగ్ నాగ‌ర్జున వ‌ర‌స సినిమాలు చేస్తు మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే నాగ‌ర్జున సోలో హీరోగా కాకుండా మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌లో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం కింగ్ తెలుగులో ‘దేవదాస్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ హీరో నాని కూడా నాగ్‌తో పాటు నటిస్తున్నాడు. ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక బాలీవుడ్‌లో కూడా ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు నాగ్. ఆ సినిమా పేరు ‘బ్రహ్మాస్త్ర’. ఇది ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది.

కరణ్ జొహార్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా త‌మిళ హీరో ధ‌నుష్‌తో కూడా ఓ మల్టీస్టార‌ర్ మూవీలో న‌టించ‌నున్నాడ‌ని సమాచారం.ఇప్ప‌టికే త‌మిళ హీరో కార్తితో క‌లిసి ఊపిరి సినిమాలో న‌టించాడు నాగ‌ర్జున. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది కూడా.తాజాగా ధ‌నుష్‌తో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నాగ్‌.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -