Friday, May 3, 2024
- Advertisement -

నాగార్జున గ్లామర్ సీక్రెట్స్..?

- Advertisement -

జీ తెలుగు ఛానల్ లో కొంచెం టచ్ లో ఉంటే చెబుతా టాక్ షోతో మాచిరాజు ప్రదీప్ విపరీతమైన పాపులారిటీని సంపాదించాడు. ఈ షోకు స్వయంగా నిర్మాత కూడా తనే కావడంతో ప్రదీప్ కు అస్సలు అడ్డే లేకుండా పోయింది. ఆర్ధికంగా నిలబడిన ఈ అమలాపురం కుర్రాడు… వైజాగ్ కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త కుమార్తెను వివాహం కూడా చేసుకుంటున్నాడని రెండు రోజుల నుంచి ఒకటే రూమర్లు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ అలా వచ్చిన ప్రపోజలన్ మనవాడు తిరస్కరించాడుకోండి అదే వేరే విషయం.

ఐతే ప్రదీప్ ఇప్పుడు ఆదివారం వచ్చిన కొంచెం టచ్ లో ఉండే చెబుతా నాగార్జున ఎపిసోడ్ మాత్రం… చాలా గ్రాండ్ గానే చేసేశాడు. గతంలో ఎందరు హీరోలు వచ్చినా ఇంతటి అధ్బుతంగా షో రాలేదనే చెప్పాలి. నాగ్ వచ్చిన వెంటనే నలు వైపుల నుంచి బుల్లితెర స్టార్లు వచ్చి.. రకరకాల పాటలు, యాక్టింగ్ లతో నాగ్ కు ఆశ్చర్యపరిచారు. అంతే కాదు… నాగ్ ఇంటి రహస్యాలను కూడా ప్రదీప్ పట్టుకున్నాడు.

నాగ్ ఇంట్లోని కాఫీ మిషన్, వియత్నాం మొక్క, జిమ్ లను ప్రదీప్ ఫొటోలతో సహా సేకరించడంతో నాగ్ ఆశ్చర్యపోయాడు. ఈ షోలో తాను డైలీ వెయిట్ లిఫ్టింగ్ 140 కిలోస్ ను ఎత్తుతానన్నాడు. అలాగే తన కుమారులు ఏకంగా `170 కిలోస్ వెయిట్ లను లిఫ్ట్ చేస్తారని.. అలాగే అమల అక్కినేని… 70కిలోస్ వెయిట్ ను లిప్ట్ చేస్తుందని చెప్పి జనాలకు ఆశ్చర్యచకితులను చేశాడు. అంతే కాదు.. కాఫీ తాగాకనే తన డైలీ లైఫ్ డెసిషన్స్ ను 7:30 నుంచి 8:30 మధ్యలో తీసుకుంటానని.. ఆటైమ్లో ఆ మూడ్ లోనే తన ప్లానింగ్ చక్కగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. బహుశా నాగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే బెస్ట్ ఇంటర్వ్యూగా అంతా ట్రీట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -