Thursday, May 16, 2024
- Advertisement -

ప్రభాస్ సాహో లుక్ లో.. భలే ఉన్నాడు..!

- Advertisement -

బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ తన కొత్త లుక్ తో ఉన్న ఒక ఫోటోను విడుదల చేశాడు. కూల్ గా ఉన్న లుక్ లో ప్రభాస్ ని చూస్తుంటే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా అమ్మాయిలు అయితే ప్రభాస్ ఈ లుక్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని.. ప్రభాస్ స్మైల్ చాలా లవ్లీగా ఉండని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బహుశా ఆ సినిమాలోని లుక్ అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా యూనిట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -