Thursday, May 16, 2024
- Advertisement -

కరెంట్ బిల్లు లేకుండా చేస్తుంది

- Advertisement -

ఇంటికి పవర్ బిల్లు వస్తుందంటే చాలు మధ్య తరగతి జనాలు బెంబేలెత్తిపోతుంటారు. వేసవి వచ్చిందంటే ఈ గుబులు మరీ ఎక్కువైపోతుంది. అందుకే ఈ సమస్య నుంచి సామాన్యులను గట్టెక్కించాలని… స్వీడన్‌ కంపెనీ చేస్తున ఓ ప్రతిపాదన ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇదెలాగంటారా ..? ఈ ఫొటోలో కన్ స్ట్రక్ట్ అవుతోన్న బిల్డింగ్‌ నేలను జాగ్రత్తగా గమనిస్తే.. వాటిపై కొన్ని పైపులు ఉన్న విషయం మనకు కనిపిస్తుంది.

ఇంతకీ ఇవేంటో తెలుసా… భవనంలోని కాంక్రీట్‌ దిమ్మెలు, స్లాబ్‌లు ఉంటాయి కదా.. అవి పరిసరాల్లోంచి సేకరించే వేడిని గ్రహించి ఇంకోచోటికి పంపే ఏర్పాట్లన్నట్లు. ఇలాంటి హీట్‌ ఎక్సేఛంజర్లతోపాటు ఛిల్లర్‌లను వాడటం ద్వారా భవనంలో విద్యుత్తు వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చునన్నది స్వీడిష్‌ కంపెనీ ఇనెకో ….మెరుపులాంటి ఆలోచన. ఈ ప్రత్యేక ఏర్పాట్లు.. ఏసీ, చలిదేశాల్లోనైతే వెచ్చబెట్టేందుకు అవసరమైన విద్యుత్తులో దాదాపు 85 శాతాన్ని తగ్గిస్తాయని ఇనెకో సీఈవో జోనథన్‌ కార్లసన్‌ అంటున్నారు.

అదొక్కటే కాదు, భవనం లోపలి ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్‌ వద్ద సాధారణంగా ఉంటాయట. ఆ తర్వాత మిగిలిన 15 శాతం పవర్ ను కూడా సేవ్ చేసేందుకు ఈ కంపెనీ క్వాంటమ్‌ సోలార్‌ ప్యానెల్స్‌ను ఉపయోగించింది. ఇనెకో ఎప్పుడో …. తమ పవర్ ఆదా వ్యవస్థను స్వీడన్‌తోపాటు చెకోస్లోవేకియా, స్పెయిన్, నెదర్లాండ్స్‌లలోని భవనాల్లో అమలు చేసింది. అతి త్వరలోనే అమెరికా, టర్కీల్లోనూ తాము ఈ సృజనాత్మక టెక్నాలజీని అమలు చేస్తున్నారు. కొత్త భవనాలకే కాకుండా…ఎప్పుడో కట్టేసిన వాటిల్లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చునని, సంప్రదాయ విద్యుత్తు వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు కూడా జరుగుతుందని వారు వివరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -