Sunday, May 5, 2024
- Advertisement -

ప్రెగ్నెన్సీ వార్త‌ల‌పై స్పందించిన రామ‌ల‌క్ష్మి

- Advertisement -

సౌత్‌ బేబీ డాల్‌ సమంత అక్కినేని ఇంటి కోడలిగా మారి ఆరు నెలలపైగానే గడుస్తోంది. ఓవైపు చైతూతో పర్సనల్‌ లైఫ్‌.. మరోవైపు సినీ కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ వస్తోంది. ఈ భామ గురించిన వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.తాజాగా ఆమె గర్భం దాల్చిందంటూ కొన్ని వెబ్‌ సైట్‌, షోషియ‌ల్ మీడియాలో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ వార్త‌ల‌పై రంగ‌స్థ‌లం రామ‌ల‌క్ష్మి స్పందించింది. ఆ కథనాలు నాకు నవ్వు తెప్పించాయి. నేను-చైతూ పిల్లల్ని గురించి ఇప్పుడే ఆలోచించట్లేదు. పిల్లల్ని కనేందుకు ఓ టైమ్‌ అనుకున్నాం. ఆ సమయం వచ్చేదాకా కెరీర్‌ గురించే తప్ప వేరే ఆలోచనలు చేయకూడదనుకున్నాం.’ అని సామ్‌ తెలిపింది.

ఒక్కసారి నేను తల్లిగా మారితే.. ఇక నాకు పిల్లలే ప్రపంచం’ అంటూ పరోక్షంగా సినిమాలకు పుల్‌ స్టాప్‌ పెడతానంటూ సంకేతాలిచ్చేసింది. ఇక పెళ్లికి ముందు కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకునే దానినన్న సమంత.. పెళ్లయ్యాక కుటుంబం గురించి కూడా ఆలోచించాల్సి వస్తోందంటూ.. తాను గమనించిన తేడాలను ఆమె వివరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -