వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తనకున్న 2+2 భద్రతను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే 1+1 కు తగ్గించింది. ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే భద్రతను తగ్గించిందని తనకు ప్రాణహాని ఉందని హైకోర్టును ఆశ్రయించారు.
మొదటినుంచి చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్కే పోరాడుతున్న సంగతి తెలసిందే. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల ఫిరాయింపు, రాజధాని భూఅక్రమాలు వంటి వాటిపై పోరాడుతున్న తనకు ప్రభుత్వం భద్రత తగ్గించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రాజధాని పరిధిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆర్కె ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన మూడున్నరేళ్ళుగా ఆర్కె ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమారు 40 కేసులు వేశారు. కొన్ని కేసుల్లో గెలవగా మరికొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి.
ఓటుకు నోటు కేసు పని అయిపోయిందనుకున్న సమయంలో ఎమ్మెల్యే ఆర్కే .. చంద్రబాబు ఆడియో టేపును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి అది ఒరిజినలేనని నిర్ధారింప చేశారు. ఓటుకు నోటు కేసుపై ఆయన కోర్టులో పోరాడుతున్నారు. రాజధాని వల్ల నష్టపోయిన రైతులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే పోరాటం చేస్తున్నారు. ప్రాణహాని ఉందని భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు
