Tuesday, April 30, 2024
- Advertisement -

‘సమంతా ఇక సినిమాలు మానదా..?

- Advertisement -

స్వీట్ సమంతా అక్కినేని వారింటికి వెళ్లినవెంటనే అప్పటి వరకు కమిటైన చిత్రాలను పూర్తి చేసి సినిమాలకు బైబై చెప్పేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇక్కడ సీన్ చూస్తే మరోలా ఉంది. అమ్మడు కొత్త చిత్రాల కౌంట్ అలా పెరుగుతూనే ఉంది. ఒకవేళ గ్లామర్ చిత్రాలు చేయాల్సి వస్తే చేస్తుందా అనేది ఇక్కడ మనం చూడాలి. చేతిలో ఉన్న మూడు సినిమాలు పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు కావడంతో ప్రస్తుతానికి ఓకే .

తాజాగా అమ్మడు 2016 లో విడుదలైన కన్నడ థ్రిల్లర్ ‘యు-టర్న్’పై పడింది. ఈమూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా అంటే సమంతాకు చాలా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేయాలని ఆమె ఎన్నాళ్లగానో అనుకుంటుంది. గతంలో చిత్ర దర్శకుడు పవన్ కుమార్ ను కూడా పలుసరాలు కలిస్ చర్చలు జరిపింది. అతి త్వరలోనే ఆమె ఈ ప్రాజెక్టును లాంచ్ చేయనుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తారట.

సమంత చేతిలో ‘రంగస్థలం 1985, మహానటి, అభిమన్యుడు’ వంటి సినిమాలున్నాయి. ఇవే కాకుండా శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి సినిమాల్లో సైతం నటిస్తుంది. దీనిని బట్టి నాగ్ కంట్రోల్ లో సమంతా ఏం లేదు. తన నిర్ణయాలు తాను తీసుకుంటుందని స్పష్టంగా అర్ధమైపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -