Tuesday, May 7, 2024
- Advertisement -

గోపీచంద్ కు ఎందుకిలా జరుగుతుంది

- Advertisement -

గోపీచంద్ .టి కృష్ణగారి అబ్బాయంటే బాగా తెలుస్తుంది. గోపీచంద్ ను ముందునుంచి బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. నేడు టి.కృష్ణ ఉంటే గోపీచంద్ లెవెల్ మరోలా ఉండేదని అందరూ చెబుతుంటారు. ఆయన చెన్నైలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడమేంటి…ఆతరువాత ఇతని అన్న టి.ప్రేమ్ చంద్ సైతం యాక్సిడెంట్ లో మరణించడమేంటి..అన్న చివరిచూపులకు రాలేక గోపీచంద్ కు రష్యాలో వీసా ప్రాబ్లెమ్స్ ఏంటో ఇప్పటికీ… ఓ ట్రాజెడీలా కనిపిస్తుంది. నేడు గోపీచంద్ కు బ్యాక్ బోన్ లా ఉంది ఎవరని అంటే తన మేనకోడలనిచ్చి పెళ్లి చేసిన హీరో శ్రీకాంతే. అలాగే ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం భవ్యాస్ ఆనంద ప్రసాద్ కూడా గోపీచంద్ కు అండగా ఉన్నాడు. అయినా గోపీచంద్ కు ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది.

కథల విషయంలో గోపీచంద్ డెసిషన్స్ కరెక్ట్ గా లేదు. శ్రీకాంత్ ఫామ్ లో ఉంటే అతనేమైనా సాయం చేసేవాడు. ఇక్కడ శ్రీకాంత్ టైమ్ కూడా ఏమాత్రం భాగాలేదు. వరుస ఫ్లాప్లు గోపీచంద్ ను భాగా డిజప్పాయింట్ చేస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ జిల్ తో మనోడికి బ్రేక్ ఇద్దామనుకున్నా… అది కూడా వర్కవుట్ కాలేదు. నా అనుకున్నవాళ్లంతా ఎవరి లైఫ్ వారు కాపాడుకుంటున్నారు తప్ప… ఎవ్వరూ గోపీచంద్ కు ఏదో సాయం చేసి అతన్ని నిలబెట్టాలనే స్థితిలో లేకపోవడం కూడా ఇక్కడ బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం…ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆక్సిజన్ కూడా చివరి నిమిషంలో సైడైపోవడమే. ఏం చేస్తాం టైమ్ అలా ఉంది. మనోడికి ఏదో ఒక రోజు టైమ్ అంటూ వస్తుంది. అప్పుడైనా నిలబడతాడని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -