Wednesday, May 22, 2024
- Advertisement -

బాలీవుడ్ లో మళ్లీ ఇలియానా

- Advertisement -

ఇలియానా. టాలీవుడ్ తో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది ఇక్కడ వరుస హిట్లు కొట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ కొన్నాళ్లపాటు చెలరేగింది. అయితే కాలం కలిసి రాక అక్కడ వరుస ఫ్లాప్ లు మూటకట్టుకుంది. పోనీ తిరిగి టాలీవుడ్ రీ ఎంట్రీ ఇద్దామా అనుకుంటే అమ్మడు అడిగిన రెమ్యునిరేషన్ కు తెలుగు నిర్మాతలు షాక్ తిన్నారు.

దీంతో బలవంతంగా ఖాళీగా ఉండిపోయింది ఇల్లిబేబి. అయితే ఈ మధ్య అక్షయ్ కుమార్ తన చిత్రం రుస్తుంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. దీంతో ఇల్లిబేబి ఉబ్బితబ్బిబ్బవుతోంది. అక్షయ్ కుమార్ సరసన నటించడం తనకు గర్వంగా ఉందని, ఈ చిత్రం నూటికి నూరు శాతం విజయం సాధిస్తుందని అంటోంది. 

ఈ సినిమాతోనైనా ఇలియానా దశ తిరిగి దిశ మారుతుందేమో చూడాలి. ఆల్ ది బెస్ట్ ఇల్లిబేబీ…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -