Monday, May 6, 2024
- Advertisement -

బ్యాటరి పవర్ ను కూడా షేర్ చేసుకోవచ్చని చెబుతున్నారు!

- Advertisement -

ఫోటోలు.. పాటలు.. వీడియోలు.. ఇలా ఏ ఫైళ్లనైనా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‍కి సులభంగా పంపించుకోవచ్చు. అందుకు బ్లూటూత్‍తో పాటు.. షేర్ ఇట్ లాంటి బోలేడు యాప్‍లు ఉన్నాయి. మరి ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‍కి పవర్‍ను షేర్ చేసుకోవడం కుదురుతుందా..? అంటే సాధ్యమేనంటున్నారు పరిశోధకులు. అందుకు పవర్ షేక్ పేరుతో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీంతో ఫోటోలు..వీడియోలు పంపించుకున్నంత సులభంగా బ్యాటరి పవర్ ను కూడా షేర్ చేసుకోవచ్చని చెబుతున్నారు.

లండన్‍లోని యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టల్‍కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త వైర్‍లెస్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ పవర్ షేక్ ను వాడుకోవాలంటే రెండు గ్యాడ్జెట్లలో చిన్నపాటి పవర్ ట్రాస్స్ మిట్టర్ కాయిల్స్ ఉండాలి. ఒక ఫోన్ లోని కాయిల్ ద్వారా కరెంట్ ప్రవహించినప్పుడు అది విద్యుదయస్కాంత క్షేత్రాన్ని తయారు చేస్తుంది. ఆ క్షేత్రం ద్వారా మరో ఫోన్ లోని రిసివర్ కాయిల్‍కు దిద్యుత్ చేరుతుంది. 

అయితే.. పోన్లు దగ్గర ఉన్నప్పుడు పవర్ షేరింగ్ వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. 12 సెకన్ల్ పాటు షేర్ చేసుకుంటే నిమిషం పాటు మాట్లడుకునేంత బ్యాటరీ నిండుతుందట. 2 నిమిషాల పాటు పంపిస్తే 4 నిమిషాల వీడియో వీక్షించేందుకు సరిపడా చార్జింగ్ అవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే.. పవర్‍షేక్ ద్వారా ఒక ఫోన్ నుంచి పంపించే పవర్ లో సగం మాత్రమే రెండో ఫోన్‍కు చేరుతుందట. ఇది కాస్త ప్రతికూల విషయమని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -