Monday, May 6, 2024
- Advertisement -

పెళ్లి లేదు కాని..పిల్ల‌లు కావ‌ల‌టా!

- Advertisement -

బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది.ఇప్పుటికే సోన‌మ్ కపూర్ పెళ్లితో పాటు మ‌రో హీరోయిన్ పెళ్లి కావ‌డంతో ఇక మిగిలిన హీరోయిన్ల పెళ్లిపై వార్త‌లు వ‌స్తున్నాయి.వీరిలో ముఖ్యంగా ఆలియా భట్‌,శ్ర‌ద్ధ క‌పూర్‌.ప్ర‌స్తుతం వీరిద్ద‌రు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల‌లో టాప్‌లో ఉన్నారు.శ్ర‌ద్ధ క‌పూర్ ఎప్పుడు పెళ్లికి రెడీ అంటే అప్పుడు పెళ్లి చేస్తాన‌ని ఆయ‌న తండ్రి శ‌క్తి క‌పూర్ తెలిపారు.శ్ర‌ద్ధ ప్రేమ వివాహం చేసుకున్న మాకు అంగీకార‌మే అని ఆమె తండ్రి శ‌క్తి తెలిపాడు.ఇక మిగిలింది మ‌రో హీరోయిన్ ఆలియా భట్‌.

ఆలియాను పెళ్లి గురించి అడిగితే విచిత్ర స‌మాధానం చెప్పింది.నాకు 25 సంవ‌త్స‌రాలు,30సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు పెళ్లి చేసుకొనని తెలిపింది.కాని ఇప్పటి నుంచే పిల్లల పేర్ల గురించి ఆలోచిస్తున్నానని అంటోంది ఆలియా.‘నా కుటుంబం ఎప్పుడూ నన్ను చిన్న పిల్లలా చూడలేదు. నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను కాబట్టి నాకంటే పెద్ద వయసు ఉన్నవారితో స్నేహం చేయాల్సి వస్తోంది. నా ఉద్దేశం ప్రకారం వయసు కేవలం సంఖ్యకు సంబంధించిన విషయం మాత్రమే.పెళ్లి గురించి ఆలోచ‌న లేకుండా పిల్ల‌ల పేర్లు గురించి ఆలోచిస్తున్నాని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది ఆలియా భ‌ట్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -