Monday, May 13, 2024
- Advertisement -

ప్రిన్స్ సరసన అలియా భట్

- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు. వరుస హిట్లతో మంచి జోరు మీదున్న హీరో. తన తాజా చిత్రం బ్రహ్మోత్సవం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ ప్రాజెక్టు తర్వాత మహేష్ చేస్తున్న మరో చిత్రం సెట్స్ కి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. దీనికి తమిళ స్టార్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రిన్స్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఆ సస్పెన్స్ కు తెరదించేశారు చిత్ర యూనిట్. ప్రిన్స్ పక్కన నటించేందుకు క్యూట్ హీరోయిన్ గా పేరొందిన అలియా భట్ ను ఎంపిక చేశారని ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా అందాల భామ పరిణితిని ఎంపిక చేశారు.

అయితే దక్షిణాది రాష్ట్రాల చిత్రాల్లో నటించేందుకు పరిణితి భారీ రెమ్యూనిరేషన్ అడిగిందట. అమ్మో.. అంతే అనుకున్నారో.. ఏమో… ఆమెని కాదని అలియా భట్ ని ప్రిన్స్ పక్కన నటించేందుకు ఎంపిక చేశారు. జూలై నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -