Tuesday, May 21, 2024
- Advertisement -

అక్షయ్ కుమార్ అంటే ప్రాణం

- Advertisement -

నేను అక్షయ్ కుమార్ కోసం పాడిన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సింగ్ ఈజ్ కింగ్ చిత్రంలో తొలి పాట పాడాను. ఆ సినిమా అక్షయ్ కుమార్ వల్ల సూపర్ హిట్ అయ్యింది. అందుకే నాకు అక్షయ్ అంటే ప్రాణం అంటున్నాడు బాలీవుడ్ లో ప్రముఖ గాయకుడు మికా సింగ్. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 3 చిత్రం ఆడియో విడుదల ఫంక్షన్ లో మికా సింగ్ అక్షయ్ ని తెగ పొగిడేశాడు.

హౌస్ ఫుల్ 3 చిత్రంలో తాను పాడిన పాటలు తప్పకుండా హిట్ కొడతాయని మికా సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘స్టంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అక్షయ్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడని. దాంతో తాను పాడిన పాటలకు మంచి జోష్ వచ్చింది’ అని మికా చెప్పాడు.

తనకు సింగ్ ఈజ్ కింగ్ పాట ఆల్ టైం ఫేవరెట్ గా నిలిచిపోతుందని చెప్పాడు. కొత్త చిత్రం  ‘హౌస్ ఫుల్ 3’లో అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ముఖ్, జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నర్గీస్ ఫక్రీ, లిసా హేడాన్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -