Tuesday, May 7, 2024
- Advertisement -

హరితేజ పెళ్లి క్యాన్సల్ తర్వాత.. ఆమె ఏం చేసింది..?

- Advertisement -

ఆలీ తో సరదాగా అనే షోలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ.. సరదా సరదా చేస్తున్నాడు ఆలీ. అయితే హరితేజ ఎన్ని షోలు.. ఎన్ని సినిమాలు చేసిన ఆమెకి మాత్రం బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ పేరు వచ్చింది. అయితే ఆమె ఆలీ తో సరదాగా షోలో పాల్గొంది. అందులో ఆమెని ఆలీ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. అయితే రెండేళ్ల ముందు బెంగళూరుకు చెందిన దీపక్ మ్యాచ్ వచ్చిందని హరితేజ తెలిపింది.

ఇంట్లోవాళ్లకు ఏదో సెట్ అవ్వక క్యాన్సిల్ అయింది. ఆ రెండేళ్ల గ్యాప్‌లో ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అయిపోయాం. రెండేళ్ల తర్వాత ఆ అబ్బాయి మళ్లీ నన్ను అప్రోచ్ అయ్యాడు. పాత గొడవలన్నీ మర్చిపోయుంటారు కదా.. ఇప్పడు చేసుకుందామన్నాడు. అప్పుడు వాళ్ల అమ్మ వచ్చి మా ఇంట్లో మాట్లడం అన్నీ జరిగిపోయాయి. నేను ఇక్కడ పనిచేయాలి.. నువ్వేమో బెంగళూరులో ఉంటావ్ ఎలా అని నేను అడిగితే.. ‘పెళ్లయిపోతే చాలే.. నువ్వు ఎక్కడైనా ఉండు.. నాకేం ప్రాబ్లెం లేదు’ అన్నాడు. నా వర్క్‌కు నువ్వు ఎటువంటి ఇబ్బందిపెట్టకపోతే ఓకే అని చెప్పి చేసుకున్నా. మా ఆయణ్ని చేసుకున్నాక చాలా బిజీ అయిపోయాను. సినిమా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. వీకెండ్స్ ఉన్నప్పుడు తనే ఇక్కడికి వచ్చి, వెళుతుంటాడు.’’ అని చెప్పింది. మరి రెండేళ్ల ముందు ఎందుకు బ్రేక్ అయింది అని అడగాగ.. అందుకు ఆమె సమాధనం మా నాన్నకు, వాళ్ల నాన్నకు ఏదో చిన్న గొడవ ఏదో అయింది. మా నాన్నకు నా మీద ఓవర్ కేరింగ్ ఉండడం వల్ల పర్సనల్‌గా అన్నీ సెట్ అయ్యాక మా ఆయనకు ఫోన్ చేసి ‘నీ సర్టిఫికెట్స్ అన్నీ ఒక సారి తీసుకొచ్చి నాకు చూపించు.

ఇది నీకు- నాకు మధ్య ఉంటుంది. మనం ఫ్రెండ్స్ అనుకుని చూపించు బాబు’ అని అన్నాడు. అప్పుడు మా ఆయనకు కోపం వచ్చేసింది. అంటే నామీద నమ్మకం లేదా? మీరు అలా ఎలా అడిగారు? ఎందుకు అడిగారు? అని కోపంతో వాళ్ల నాన్నకు చెప్పి, వాళ్ల నాన్న మాకు ఫోన్ చేసి మీకు అంత నమ్మకం లేకుంటే మానేయండి అనే సరికి, మా నాన్న ఇలా అన్నారే అని నాతో అన్నారు. అలా బ్రేక్ అయింది. ఆ తర్వాత మా ఆయన తన తప్పు తెలుసుకోవడానికి రెండేళ్లు పట్టింది. తర్వాత పెళ్లి చేసుకున్నాం. దీపక్ చాలా ఫిట్‌నెస్ ఫ్రీక్ అని, తాను బెంగళూరుకు వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసి జిమ్‌లో కపుల్ వర్కవుట్స్ చేసుకుంటుంటామని హరితేజ చెప్పుకొచ్చింది. తన భర్తకు ఫిట్‌నెస్‌ అంటే ఎంతిష్టమో చెప్పడానికి ఓ ఆశ్చర్యకర సంఘటనను కూడా బయటపెట్టింది. పెళ్లి అయిన నాలుగైదు రోజుల తర్వాత.. ఓ రోజు సాయంత్రం జిమ్‌కు వెళ్తున్నా వస్తావా?’ అన్నాడు.

నేను ఏమో బయటకు వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకున్నా.. ఇక నేను జిమ్ కి రాను అని ఇంట్లోనే ఉండి మా అమ్మకు ఫోన్ చేసి బాగా ఏడ్చేదాన్ని. ఏంటమ్మా ఇంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. జిమ్ అని ఎప్పుడూ అక్కడే పడుంటాడు అని మా అమ్మకు కంప్లయింట్ చేసినా.. ‘సర్లెమ్మా.. పర్లేదు. అబ్బాయిలు మెల్లగా మారుతారు.’ అని నాకే క్లాస్ పీకేది. ఆ తర్వాత నేనే మెల్ల మెల్లగా మారి జిమ్ కి వెళ్లడం మొదలు పెట్టా అని తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది హరితేజ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -