Friday, May 17, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి ఒంట‌రేనా …? ఆయ‌న అధికారాల‌న్ని క‌ట్ చేసిన చంద్ర‌బాబు..

- Advertisement -

తెలంగాణా టీడీపీలో రేవంత్ రెడ్డి ఎపిసోడ్ క్టైమాక్స్‌కు చేరింది. ఇక ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్సెండ్ చేయ‌డ‌మే మిగిలింది. ఇప్ప‌టికె వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభపక్షనేత పదవుల నుండి రేవంత్‌రెడ్డిని తొలగించాలని చంద్రబాబుకు ఎల్. రమణ లేఖ రాశారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. రెండు రోజుల్లో చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

తాజాగా పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ‌,రేవంత్ రెడ్డిల మ‌ధ్య వివాధం తారాస్థాయికి చేరింది. 26వ తేదిన టిడిఎల్పీ సమావేశం నిర్వహించాలని రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ స‌మావేశానికి నేత‌లు అవ‌స‌రంలేదు. కాని రేవంత్ పార్టీనేత‌ల‌ను ఆహ్వానించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై ఎల్ ర‌మ‌ణ ఘాటుగా స్పందించారు. టిడిఎల్పీ సమావేశంతోపాటు పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని రేవంత్‌రెడ్డిని ఆదేశించారు. ఇదంతా చంద్ర‌బాబు ఆదేశాల‌తోనె జ‌ర‌గుతోంద‌నేది తెలుస్తోంది. అందుకె రేవంత్‌పై టిడిపి నాయకత్వం చర్యలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తోందని ఈ పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

అయితె ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంట ఉండే దెవ‌రు అనేది ఇప్పుడు పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీ టీడీఎల్పీ స‌మావేశానికి పోటీగా పార్టీ అధ్య‌క్షుడు ఎల్ .ర‌మ‌ణ భాజాపా-టీడీపీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ర‌మ‌ణ రాసిన లేఖ‌కు చంద్ర‌బాబు స్పందించారు.

తాను తిరిగి వచ్చేంత వరకూ టీఎస్ టీడీపీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ కు ఉన్న అధికారాలన్నీ తొలగిస్తున్నట్టు చెప్పారు. పార్టీకి సంబంధించిన సమావేశాలు రేవంత్ రెడ్డి నిర్వహించరాదని ఆదేశించారు. పార్టీ తరఫున ఏవైనా సమావేశాలు నిర్వహించాలని భావిస్తే, రేవంత్ రెడ్డిని ఓ ఎమ్మెల్యేగా మాత్రమే భావిస్తూ ఆహ్వానించాలని సూచించారు. ఆయన అధ్యక్షతన ఎలాంటి సమావేశాలనూ అనుమతించేది లేదని, అవి పార్టీ సమావేశాలుగా గుర్తించవద్దని చంద్రబాబు ఆదేశించారు.

మ‌రో వైపు రేవంత్‌రెడ్డి అనుచరవర్గం ఖాళీ అయిపోతోంది. విడ‌త‌ల వారీగా టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రేవంత్‌ అనుచరులంతా జంప్‌ అయిపోతున్నారు. రేవంత్‌ అనుచరులే కాదు, టీడీపీలో రేవంత్‌ వ్యతిరేక వర్గం కూడా టీఆర్‌ఎస్‌ వైపు వెళ్ళిపోతుండడం గమనార్హం.

నిన్న మొన్నటిదాకా విన్పించిన 25 మంది ఇప్పుడేం చేస్తున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. వారిలో కొంతమంది, ఆల్రెడీ టీఆర్‌ఎస్‌తో టచ్‌లోకి వెళ్ళిపోయారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, రేవంత్‌రెడ్డి దాదాపు ఒంటరి అయిపోయినట్టేన‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న‌కున్న అధికారాలను క‌ట్ చేయ‌డ‌తో ఇప్పుడు ఏంచేస్తార‌నేది ఉత్కంఠంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -