Wednesday, May 15, 2024
- Advertisement -

త‌న సినిమాల‌ను బ్యాన్ చేయండి అంటోన్న హీరోయిన్‌

- Advertisement -

సాధ‌ర‌ణంగా ఎవ‌రైన త‌మ సినిమాలు చూడండి అంటు అడుగుతు ఉంటారు. కాని ఇక్కడ పూర్తి రివ‌ర్స్ బాలీవుడ్ నటి, హీరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం అందుకు తాను మినహాయింపు అంటున్నారు. అందుకే తన సినిమాలన్నింటినీ ఎలాగైనా సరే నిషేధించండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రచయిత్రిగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ట్వింకిల్ రాసిన ‘పైజమాస్ ఆర్ ఫర్‌గివింగ్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంగా తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు ‘మీరు నటించిన సినిమాల్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం, రీమేక్ కూడా చేయాలని భావిస్తారని’ ఆమెను అడిగారు. నేను నటించిన ఒక్క మూవీ కూడా హిట్ కాలేదు.

సక్సెస్ అయిన మూవీలలో నేను నటించలేదు. అందుకే ఆ సినిమాలను నిషేధిస్తే.. ఎవరూ వాటి రీమేక్ జోలికి కూడా వెళ్లరని’ ఏమాత్రం తడబాటుకు లోను కాకుండా చెప్పేశారు ట్వింకిల్. ‘బర్సాత్‌’, ‘ఇతిహాస్‌’, ‘జుల్మి’, ‘మేలా’ వంటి హిందీ చిత్రాల్లో నటించిన ట్వింకిల్… తెలుగులో వెంకటేష్‌ సరసన ‘శీను’ చిత్రంలో తళుక్కున మెరిశారు. అయితే ఈ భామ న‌టించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో త‌ర‌వాత అవ‌కశాలు పెద్ద‌గా రాలేదు. దీంతో హీరో అక్ష‌య్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ట్వింకిల్ ఖన్నా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -