Monday, April 29, 2024
- Advertisement -

లీప్ లాక్‌ల‌కు బ‌య‌ప‌డి అర్జున్ రెడ్డి నుంచి త‌ప్పుకున్న హీరోయిన్‌

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోగా మార్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌శ‌,దిశ మారిపోయింది. ఈ సినిమాను అన్ని బాష‌ల‌లో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త‌మిళంలో స్టార్ ద‌ర్శ‌కుడు బాల ఈ సినిమాను హీరో విక్ర‌మ్ కొడుకు ధృవ్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ఇక బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్ ఈ మూవీలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సుతారియాను ఎంపిక చేశారు. అయితే, ‘అర్జున్ రెడ్డి’ ఒరిజినల్ సినిమాను చూసిన తార భయపడిపోయిందట.

హీరోహీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో తాను నటించలేనంటూ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ కూడా ధ్రువీకరించింది. మరో హీరోయిన్ కోసం ధర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు. ఇక తెలుగు అర్జున్ రెడ్డికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి బాలీవుడ్ అర్జున్ రెడ్డికి కూడా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను వ‌హిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -