Sunday, May 5, 2024
- Advertisement -

టీఆర్ఎస్ సహా దోస్తుల ఓట్లు 60 శాతం

- Advertisement -

గత 35ఏళ్లలో అంటే టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఏనాడూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో 60 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేదని ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అధికారం దక్కించుకోవాలంటే 60 సీట్లు గెల్చుకోవాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ హస్తం పార్టీ తెలంగాణలో అన్ని స్థానాలను అందుకోలేకపోయింది. 1989లో కాంగ్రెస్ ప్రభంజనంలో గరిష్టంగా 58 అసెంబ్లీ స్థానాలనే గెల్చుకుంది. ఇలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఈ సారి 60 సీట్లు గెల్చుకోవడం కష్టం, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతోంది. అని ఆంధ్రజ్యోతి ఇచ్చిన కథనం వాస్తవమే.

గత 35 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ గెల్చుకున్న అసెంబ్లీ సీట్ల వివరాలనూ ఆ కథనంలో ప్రచురించింది.

1983లో 43 స్థానాలు
1985లో 14 స్థానాలు
1989లో 58 స్థానాలు
1994లో 10 స్థానాలు
1999లో 43 స్థానాలు
2004లో 54 స్థానాలు
2009లో 50 స్థానాలు
2014లో 21స్థానాలు

ఇలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కూడా గెలవడం కష్టమే అన్నది ఆ వార్త సారాంశం. అవును అది నిజమే. అసలే అంతర్గత కుమ్ములాటలతో, ఎవరికివారే యమునాతీరే అన్నచందంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అంత ఈజీ కాదు. ఎవరికి వారే సీఎం కుర్చీపై కన్నేసి, ప్రత్యర్ధికి కన్నుగీటి, రాజకీయాలు చేసే కాంగ్రెస్ ఈ సారి కూడా 60 సీట్లు అందుకోవడం కష్టమే. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే, బీసీ కేడర్ బలంగా ఉన్న ఆ పార్టీ అనుకూలత, తమకు లాభం చేకూరుస్తుందని కాంగ్రెస్ నేతల ఆశ. కానీ అది గతం, టీడీపీ నుంచి గెలిచిన 15మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అందరూ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. వారితో పాటే వారి అనుచరులనూ తీసుకుపోయారు. పైగా మిగిలిన వాళ్లు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ తమ శతృవుగా భావించి పోరాడినవాళ్లే. వాళ్ల ఓట్లను కాంగ్రెస్ ఆకట్టుకుంటుదనేది కల్ల. 2014లో కాంగ్రెస్,సీపీఐ కలసి పోటీ చేస్తే 25.91 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసి 21.58 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. సొంతంగా పోటీ చేసిన టీఆర్ఎస్ 34.04 శాతం ఓట్లుతో 63 స్థానాలను కైవసం చేసుకుంది.

ఇప్పుడు బయటకు బీజేపీ నేతలు సై అంటున్నా, తెరవెనుక గులాబీ, కమలం మిత్రులేనన్నది జగమెరిగిన సత్యం. నాడు 7.03 శాతం ఓట్లు తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ తో దోస్తీ కడుతోంది. అంటే నాటి టీఆర్ఎస్ 34.04 శాతం ఓట్లుకు బీజేపీ 7.03 శాతం ఓట్లు కలుస్తున్నాయి. మరోవైపు టీడీపీ క్యాడర్ కూడా చాలావరకూ గులాబీగూటిలో చేరిపోవడంతో 2014లో ఆ పార్టీకి ఉన్న 14.55 శాతం ఓటు బ్యాంకు ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. అంటే ఆ 14.55 శాతం ఓటు బ్యాంక్ నుంచి దాదాపు 10 శాతం టీఆర్ఎస్ లో కలిసిపోయింది. ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారి ప్రభావంతో నాడు హస్తం పార్టీ సాధించిన 25.02 శాతం ఓట్లులో కనీసం ఆరేడు శాతం ఓట్లు గులాబీ నేతలకే పడతాయి.

టీఆర్ఎస్ 34.04 + టీడీపీ నుంచి వచ్చిన 10శాతం + బీజేపీకి చెందిన 7.03 శాతం+ కాంగ్రెస్ నుంచి వచ్చిన 7శాతం = 58.07 శాతం ఓటు బ్యాంక్ ప్రస్తుతానికి టీఆర్ఎస్ ఖాతాలో ఉంది. ఇక గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డే కేసీఆర్ ఎమ్ఐఎమ్, కమ్యూనిస్టులనూ ఎంతో కొత ప్రబావితం చేసి ఒకటి రెండు శాతం ఓట్లునైనా సాధించుకుటారు. ఈ లెక్కలన్నింటి బట్టీ చూస్తే కేసీఆర్ కు 60 శాతం వరకూ ఓటు బ్యాంక్ కనిపిస్తోంది. మిగిలిన పార్టీలన్నీ కలిసినా 40 కష్టమేననిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -