Wednesday, May 22, 2024
- Advertisement -

ఈ రికార్డులు అన్నీ.. పవన్ సినిమా రిలీజయ్యేంత వరకేనా!

- Advertisement -

బాహుబలి, శ్రీమంతుడు.. వంటి సినిమాలు తెలుగు సినిమా స్థాయిని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇంటా బయట కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తూ…

అదుర్స్ అనిపించుకొంటున్నాయి. వసూళ్ల విషయంలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరి ఈ సినిమాల హడావుడి అంతా పవన్ సినిమా వచ్చేంత వరకేనేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇంకా ప్రారంభ దశలోనే పవన్ సినిమా కోట్ల రూపాయల బిజినెస్ ను చేస్తోంది. దీంతో కొత్తరికార్డులు సృష్టించడం ఖాయమేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా రైట్స్ ను సోలోగా కొనేసింది ఈరోస్ ఇంటర్నేషనల్. దాదాపు డెబ్బై కోట్ల రూపాయలకు పైగా వెచ్చింది ఆ విదేశీ సంస్థ ఈ రైట్స్ ను కొనేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ సినిమా రైట్స్ ను సోలోగా సొంతం చేసుకొన్న ఆ సంస్థ నుంచి హక్కులను కొనడానికి అనేక మంది పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమా విదేశీహక్కులను పక్కనపెడితే. .దేశంలోనే విడుదల హక్కులు దాదాపు 70 కోట్ల రూపాయల పై స్థాయికి చేరతాయని లెక్కలు వినిపిస్తున్నాయి. దీంతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దర్జాగా బయటపడవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరివిడుదలకు ముందే డెబ్బై కోట్ల రూపాయలు వ్యాపారం అంటే.. విడుదల అయ్యాకా అది వంద కోట్ల రూపాయల మార్కును రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకొంటే పవన్ సినిమా.. పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తుందేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -