Saturday, May 18, 2024
- Advertisement -

బ్రహ్మీని టార్గెట్ చేసింది ఎవ‌రు..

- Advertisement -

ఎంతటి నెల్లూరి పెద్దారెడ్డిగారి మేనల్లుడైనప్పటికీ…ఆయనకీ కష్టాలు తప్పట్లేదు. ఎవరికి వారు ఇంతకాలం ఆయన్ని కూరలో కరివేపాకులా వాడుకున్నవారే. కానీ ఇపుడతన్ని పూర్తిగా వాడటం మానేశారు.

దీంతో బ్ర‌హ్మానందం ఎవ్వ‌రికీ అర్ధం కాని ఓ బ్ర‌హ్మ ప‌దార్దంలా మారిపోతాడేమోన‌న్న సందేహం ప్రేక్ష‌కుల్లో క‌లుగుతోంది. మెగా కాంపౌండ్ నుంచి నంద‌మూరి కాంపౌండ్ వ‌ర‌కూ ఎవ్వ‌రికీ బ్ర‌హ్మీ అవ‌స‌రం లేదిపుడు. ఒక అవ‌స‌ర‌మైతే ప్రేక్ష‌కుల‌కు త‌మ అవ‌స‌రం పోతుందోన‌నే భ‌యం. ఎందుకంటే బ్ర‌హ్మీ ఏ  సినిమాలో చేస్తే ఆ సినిమాలో హీరో క‌నిపించ‌డం లేదు. దీనికి తోడు రీసెంట్ గా శ్రీమంతుడులో బ్ర‌హ్మీని ముందుగా అనుకుని ఆత‌రువాత తీసేశారు.

లేటెస్ట్ గా సినిమా చూపిస్త మావ‌లో ట్రైల‌ర్లో సార్ ఉన్నారు. రైట్స్ దిల్ రాజు చేతికి పోయాక మూవీలో సార్ లేరు. ఇద‌నే కాదు రానున్న చాలా చిత్రాల్లో అన‌గా శ్రీనువైట్ల లాంటి (బ్రహ్మీతో పైకొచ్చిన) ద‌ర్శ‌కులు కూడా బ్ర‌హ్మానందంను త‌న సినిమాల్లోకి తీసుకోలేని స్థితి. బాల‌య్య‌బాబు డిక్టేట‌ర్లో బ్ర‌హ్మీని ఉన్న ఫ‌లంగా తీసేయ‌డ‌మూ ఓ అవ‌మాన‌మే. ఇలా చెపుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నిర్మాత‌లకు అన‌వ‌స‌ర ఖ‌ర్చ‌నుకోవ‌డం, హీరోలు త‌మ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంద‌ని ఫీల‌వ్వ‌డం దీనికి కార‌ణాలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -