మైటీ స్టార్ శ్రీకాంత్ కుమారుడు రోషన్ రంగ ప్రవేశం….. ఆషామాషీగా జరిగేటట్లుగా లేదు. ఓ రేంజున్న హీరో బ్లాక్ బస్టర్ కొట్టాలని ట్రై చేస్తే…. ఎలాంటి స్కెచ్ వేస్తాడో…. ఆ తరహా స్కెచ్ రోషన్ డెబ్యూ చిత్రంలో కనిపిస్తుంది.
ఇంతకీ నాగార్జున, శ్రీకాంత్ లు రోషన్ ను ఎలా ప్రమోట్ చేయాలని తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోక తప్పదు. రోషన్ చేస్తోన్న నిర్మలా కాన్వెంట్ లో ఒక పాటలో ఏకంగా టాలీవుడ్ బెటాలియన్ మొత్తాన్ని దింపేస్తున్నారు. ఏకంగా టాప్ యాక్టర్స్ 21 మంది వరకు ఆ పాటలో హల్చల్ చేసి చిందేయబోతున్నారట. గతంలో ఈ కాన్సెప్ట్ ను షారుక్ ఓంశాంతిఓంలోను, నాగార్జున కింగ్ సినిమాలోను, సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బి చౌదరి కుమారుడు జీవా చేసిన రంగం చిత్రం మ్యాటర్లోను ఇది జరిగింది.
అయితే ఇంతగా గతంలో జరిగిన బాపతి ఎక్కడా లేదు. ఎంతైనా శ్రీకాంత్ అందరివాడు అజాత శత్రువు కాబట్టి…. అతని కుమారుడికి ఇంతటి స్థాయిలో ప్రమోషన్ రావడానికి కారణమైంది. అన్నట్లు ఇంకో విషయం…అయితే ఆ టాప్ యాక్ట్రర్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు, అక్కినేని కుటుంభం నుంచి ముగ్గురుతో పాటు రవితేజ, గోపీచంద్ అండ్ బ్యాచ్ తో పాటు పలువురు నోటెడ్ ఆర్టిస్ట్ లు రోషన్ ను ఎంకరేజే చేసేవారిలో ఉన్నారు.
