పివిపి సినిమా. సౌత్‌లో ఎంతో నోటైడన సినీ నిర్మాణ సంస్థ. కార్పొరేట్ రేంజ్ లో సినిమాలు రూపొందించే సత్తా ఉన్న బ్యానర్. ఈ సంస్థ ముందు నుంచి బిగ్ స్టార్ క్యాస్ట్ తో సినిమాలు రూపొందిస్తూ ఉంది.
ఇప్పటి వరకూ 7 సినిమాలు నిర్మించిన ఈసంస్థ అధినేత ప్రసాద్ వి పొట్లూరి…. త్వరలో తన చేతిలో ఉన్న ఇంకో ఐదు చిత్రాలను రిలీజ్ చేయడానికి చూస్తున్నాడు. అయితే అతను చేసే ప్రతి చిత్రంలో చేసే స్టార్ క్యాస్ట్ టాప్ ఆర్టిస్ట్ లతోనే ఉంటుంది. హీరో ఓరియెంటెడ్ చిత్రం చేసినా,హీరోయిన్ బేస్డ్ ఫిలిం రూపొందించినా… టాప్ ర్యాంక్ వారే…. పివిపికి కావాలి. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ…ఏ సినిమా చేసినా…. అందుల్లో పెద్ద హీరోలు ఉండేలా కేర్ తీసుకుంటుంది. ఒక వేల హీరోయిన్లతో చేసినా అదే రీతిలో ప్రిఫరెన్స్ ఇస్తుంది.
ప్రస్తుతం నాగార్జున, కార్తీలతో మల్టీస్టారర్ చిత్రం చేస్తోన్న పివిపి …తన చెంతకు ఏ దర్శకుడైనా చిన్న చిత్రంతో వస్తే… అతనితో చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.ఎంత పెద్ద బ్యానర్ అయినా….కథ నచ్చితే చిన్న చిత్రాలు
చేస్తుందేమో గాని… పివిపి సినిమా … ససేమిరా అంటోంది. మొన్నామధ్య ఏదో పెద్ద సినిమా చేద్దామని పవన్ కు ప్రసాద్ వి పొట్లూరి ఎంత క్లోజ్ అయినప్పటికీ….పవన్ తో సినిమాకు మాత్రం ఛాన్స్ కొట్టలేకపోయాడు. చివరకు మహేష్ తో సరిపెట్టుకోవల్సి వచ్చింది. కోలీవుడ్లో మాత్రం మాక్జిమమ్ అనుష్కను నమ్ముకునే సినిమాలు చేస్తూ వస్తున్నాడు.లేదంటే కమల్ తరహాలో ఎవరైనా మరో టాప్ హీరో డేట్స్ ఇస్తే సినిమా చేస్తానంటున్నాడు. లేటెస్ట్ గా తారక్ కూడా పివిపి సినిమాకు కమిటయ్యాడు. బహుశా పివిపి కూడా యాష్ రాజ్ ఫిలింస్ మాదిరిగా భారీతనంతో సినిమాలు చేస్తేనే తమ బ్యానర్ ప్రెస్టీజ్ పోకుండా ఉంటుందని బావిస్తుందేమో అంటూ కొందరు భావిస్తున్నారు.
