- Advertisement -

టాలీవుడ్‌లో ‘సిల్లీ ఫెలోస్‌’ ఎవ‌రు

- Advertisement -

ఇద్ద‌రు హాస్య న‌టులే. వీరిద్ద‌రూ సినిమా తెర‌పై క‌నిపిస్తే న‌వ్వులు విర‌బూస్తాయి. అయితే ఆ న‌వ్వులు చాలా రోజుల‌య్యింది మిస్స‌య్యి. వారికి విజ‌యం ద‌క్కి కొన్ని సంవ‌త్స‌రాల‌య్యింది. అలాంటిది వారిద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేస్తున్నారు. మ‌రీ వారిద్ద‌రికీ ఈ సినిమాతోనైనా విజ‌యం వ‌చ్చెనో చూడాలి.

తండ్రి వార‌స‌త్వంతో వ‌చ్చిన న‌టుడు అల్లరి నరేశ్‌. స్వ‌శ‌క్తితో సినీ రంగానికి వ‌చ్చిన న‌టుడు సునీల్‌. వీరిద్ద‌రూ ఎన్నో సినిమాలు చేశారు. మంచి హిట్లు కొట్టారు. ఇప్పుడు కాలం క‌లిసి రావ‌డం లేదు. దీంతో కొంచెం ఆలోచించి మంచి సినిమాతో ఇద్ద‌రం క‌లిసి వ‌ద్దామ‌ని నిర్ణ‌యించుకొని సినిమాతో వ‌స్తున్నాయి. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో సునీల్‌, అల్ల‌రి న‌రేశ్ హీరోలుగా న‌టిస్తున్నారు. రాయ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ పెట్టార‌ని తెలుస్తోంది. ‘సిల్లీ ఫెలోస్‌’ అనే పేరును నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవ‌కాశం ఉంది. నరేష్‌ – భీమినేని కలయికలో వచ్చిన ‘సుడిగాడు’ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో విజయవంతమైన ‘తమిజ్‌ పాదం’కి రీమేక్‌ను తెలుగులో తీస్తున్నారు. దీన్నే ‘సిల్లీ ఫెలోస్‌’ పేరుతో తెలుగులో తీస్తున్నారని సమాచారం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -