Friday, May 3, 2024
- Advertisement -

హీరోగా ‘బిత్తిరి స‌త్తి’ అదిరిపోయే సినిమా

- Advertisement -

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రవి ఆ త‌ర్వాత వీ6 చానెల్‌తో అత‌డి కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఒక్క షోతో సెల‌బ్రిటీ స్థాయికి ఎదిగిన ర‌వి అలియాస్ బిత్తిరి స‌త్తి ఇప్పుడు రోజుకో ఒక‌సారి బిత్తిరి స‌త్తిని చూడంది తెలుగు ప్రేక్ష‌కులు నిద్ర‌పోవ‌డం లేదు. అంత‌టి కీర్తి గ‌డించిన బిత్తిరి స‌త్తి ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు

తొలి నుంచి సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి రావ‌డానికి స‌త్తి చాలా ప్ర‌య‌త్నాలు చేశాడు. వీ6తో ఫేమ‌స‌వ‌డంతో సినిమా అవ‌కాశాలు వ‌రుస‌గా వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన పాత్ర‌లు చిన్న పాత్ర‌లే. ఇప్పుడు తొలిసారిగా హీరోగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప్ర‌స్తుతం బిత్తిరి స‌త్తి టీవీ ఛానల్‌తో పాటు సినిమాలు, వివిధ షోలోకు గెస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు.

ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో రూపొందించే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు అని సమాచారం. ‘బతుకమ్మ’ సినిమా దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం చేయ‌నున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు ‘తుపాకీ రాముడు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం నాడు సినిమాను ప్రారంభించాల‌ని చూస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -