Friday, March 29, 2024
- Advertisement -

అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్ అదుర్స్!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది కామెడీ హీరోలు వచ్చారు. వారిలో అల్లరి నరేష్ ఒకరు. రవిబాబు దర్శకత్వంలో అల్లరి చిత్రంతో హీరోగా రంగప్రవేశం చేసిన నరేష్ తర్వాత కామెడీ హీరోగా మారారు. గత కొంత కాలంగా స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న అల్ల‌రి న‌రేష్‌ ‘బంగారు బుల్లోడు’ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. గిరి ప‌ల్లిక ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌రేష్ స‌ర‌స‌న పూజా జవేరి న‌టిస్తోంది.

తాజాగా ‘బంగారు బుల్లోడు’ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ ‘బంగారు బుల్లోడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో అల్లరి నరేష్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ జంటగా పూజా జవేరి నటిస్తోంది.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తున్నాడు. అల్లరి నరేష్‌ బ్యాంక్‌ ఉద్యోగిగా, కస్టమర్లు కుదవ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండటం ట్రైలర్‌లో చూపించారు. మొత్తానికి ఈ చిత్రం చూస్తుంటే సస్పెన్స్, కామెడీ కలిసినట్టు ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -