ఆన్ స్ర్కీన్ కనిపించే హీరోల్లో చాలామందికి ఆఫ్ స్ర్కీన్ వర్క్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ అంటే చాలా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఓ కామెడీ హీరో నేను మాత్రం మెగాఫోన్ పట్టడం గ్యారంటీ అంటున్నాడు. ఎగ్జాట్ టైం చెప్పలేను కానీ వీలైనంత త్వరలో మెగా ఫోన్ పట్టుకుంటా అంటున్నాడు అల్లరోడు. నాకు మొదట్నుంచి నటన.. దర్శకత్వమంటే ఇష్టం.
అనుకోకుండా హీరోగా చాలా సినిమాలు చేశా.. భవిష్యత్ లో డైరెక్టర్ ని కూడా అవుతా అని స్టేటిమెంట్ ఇస్తున్నాడు. ఈ విషయంలో నాన్నే నాకు ఇన్సిపిరేషన్ అని అల్లరి నరేష్ చెబుతున్నాడు. కానీ ఫుల్ టైమ్ డైరెక్టర్ గా ఫిక్సై అవ్వడట దర్శకుడిగా మహా అయితే ఓ రెండు మూడు సినిమాలు మాత్రమే తీస్తాడట. అన్నీ కుదిరితే వచ్చే ఆరేడు నెలల్లో డైరెక్టర్ గా తన డెబ్యూ మూవీని మొదలుపెట్టే అవకాశాలున్నాయని హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాను డైరెక్ట్ చేయబోయే సినిమాలో మాత్రం నరేష్ యాక్ట్ చేయడట. డైరెక్షన్ అంటే చాలా రెస్పాన్సిబుల్ జాబ్.. అన్నీ పనులు ఒకేసారి చేయడం నా వల్ల కాదు అంటున్నాడు.
