Thursday, May 9, 2024
- Advertisement -

‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీ రివ్యూ

- Advertisement -
sahasam swasaga sagipo movie review

చాలా కాలం తర్వాత ప్రేమమ్ తో మంచి సూపర్ హిట్ కొట్టాడు అక్కినేని నాగ చైతన్య. అయితే ప్రేమమ్ కంటే ముందే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో  సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమా మొదలు పెట్టాడు చైతన్య. కానీ కొన్ని సమస్యలతో ఈ సినిమా విడుదలకాలేకపోయింది. ఏది ఏమైన ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మళయాళ భామ మంజిమా మోహన్ నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. బాబా సెహగల్ పోలీస్ అధికారి పాత్రలో నటించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మరి ఎంత వరకు ఈ సినిమా ప్రేక్షకుల ఆకటుకుందో చూద్దాం…

కధ:

 నాగ చైతన్య కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. తన చెల్లెలి ఫ్రెండ్ లీల(మంజిమ మోహన్) తో ప్రేమలో పడతాడు చైతు. లీల తన ఉద్యోగం కోసం చైతు వాళ్ళా ఇంట్లో ఉంటుంది. ఒక రోజు వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా వైజాగ్ నుంచి కన్యాకుమారి వరకు బైక్ లో వెళ్తారు. ఇంతలో ఒక అనూహ్య సంఘటన ఎదురవుతుంది. అయితే చైతు ఈ సంఘటనను ఎలా ఎదుర్కొన్నాడు, తన ప్రేమ విజయం సాదిన్చిండా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

ప్లస్ పాయింట్స్: 

నాగ చైతన్య మరోసారి తన అద్భుతమైన నటనతో అలరించాడు. హీరోయిన్ మంజిమా మోహన్ లీల చాలా బాగా చేసింది. చైతు తో రోమాన్స్ బాగా పండించిందని చెప్పుకోవాలి. బాబా సెహగల్ పోలీసు అధికారి పాత్రలో బాగా నటించాడు. గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిది మేరకు బాగా నటించారు. సాంకేతిక విభాగానికి వస్తే రెహ్మాన్ సంగీతం వీనుల విందుగా ఉంది బాగా అలరించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డాన్ మాక్ ఆర్ధర్ చాయాగ్రహణం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పాటల్లో కొన్ని సన్నివేశాలు తీసేటప్పుడు తన కెమెరా పనితనాన్ని బాగా చూపించాడు. చైతుకి ఈ సినిమా మరో హిట్ ఇస్తుందని చెప్పోచ్చు.

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోవడం ఈ సినిమాలో మైనస్. స్ట్రాంగ్ విలన్ ఉంటే సినిమా ఇంకో రెంజ్ లో ఉండేది. కామెడీ లేకపోవడం మరో మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమా సెకండ్ ఆఫ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ బోరు కొట్టించిన.. అక్కడ అక్కడ రొమాంటిక్ సీన్స్ తో అలరించాడు. దర్శకుడు కామెడీ మీద కొన్ని సిన్స్ రాసుకుంటే బాగుండేది. 

మొత్తంగా:

రొమాంటిక్, యాక్షన్ రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్ను తన మార్క్ థ్రిల్లర్గా మలిచాడు. ఇక స్లో నేరేషన్, కామెడీ లేకపోవడం ఈ సినిమాలో మైనస్. ఒక్కమాటలో చెప్పాలంటే… గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

{youtube}SdXcoCYOZxU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -