Monday, May 6, 2024
- Advertisement -

ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్ ‘నాంది’ ట్రైలర్!

- Advertisement -

టాలీవుడ్ లో టాప్ కామెడీ హీరోలు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ల తర్వాత ‘అల్లరి’ చిత్రంతో తనదైన కామెడీ మార్క్ చాటాడు నరేష్. తాను నటించి మొదటి చిత్రం అల్లరి మూవీనే ఇంటి పేరుగా మార్చి అల్లరి నరేష్ గా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ నవ్విస్తూ కిత కితలు పెట్టే అల్లరి నరేష్ ఆ మద్య విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు.  గ‌మ్యం, శంభో శివ శంభో, ల‌డ్డూబాబు వంటి విభిన్న క‌థా చిత్రాలు చేసిన అల్ల‌రి న‌రేష్ ప్ర‌స్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ చేస్తున్నారు. 

ఎన్నడూ కనిపించని విధంగా సీరియస్ మోడ్ లో కనిపించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ను కొద్ది సేప‌టి క్రితం మ‌హేష్ విడుద‌ల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. చేయ‌ని త‌ప్పుకు జైలు శిక్ష అనుభ‌వించే వ్య‌క్తి పాత్ర‌లో అల్ల‌రి న‌రేష్ న‌టించారు.  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ లో అల్లరి నరేష్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. లాయర్ గా టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మంచి రోల్ లో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. 

చిత్రంలో న‌వ‌మి, హ‌రీష్ ఉత్తమ‌న్‌, ప్రవీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్రపాణి, రాజ్యల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్రమోదిని, గ్రిగ్నేశ్వర రావు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. చోటా కె. ప్రసాద్ ఎడిటర్. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. చైతన్య ప్రసాద్, శ్రీమణి సాహిత్యం అందించారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -