టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.అల్లు అర్జున్, స్నేహారెడ్డితో వివాహం జరిగింది. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలున్నారు.అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లిన ఆయన వెంటే వస్తుంది స్నేహారెడ్డి.తాజాగా బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. లెహంగా ధరించిన తన భార్య స్నేహారెడ్డి ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఓ మై గాడ్.. ఇంతటి అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని నమ్మలేకపోతున్నాను’ అంటూ పగలబడి నవ్వుతున్న ఓ ఎమోజీ పెట్టాడు.
ఈ పోస్ట్ ద్వారా బన్నీ తన భార్యపై ఎంత ప్రేమతో ఉన్నాడో తెలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇక బన్నీ ‘నా పేరు సూర్య’ సినిమా తరువాత ఇప్పటి వరకు మరో సినిమాను ఎనౌన్స్ చేయలేదు.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
