Friday, May 10, 2024
- Advertisement -

వ్యక్తిగత జీవితం మీ ఇష్టం ..ప్రజాజీవితంలో కచ్చితంగా ప్రశ్నిస్తాం..

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పని కొందరు, లేదు ఆయన అన్నదానిలో తప్పేముంది ? ఉన్నమాటే అంటే ఉలుకెందుకు ? జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమే కదా అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ అన్న వ్యాఖ్యలు ఏంటో ఓ సారి చూద్దాం.

ఏపీకి మోసం చేసిన వారిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. బీజేపీ, టీడీపీతో కలసి నాలుగేళ్లు కాపురం చేసి, ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చి నేను పతివ్రతను అని పవన్ చెప్పుకుంటున్నాడు. ఏపీని ముగ్గురూ కలిసి పొడిచేశారు. ఇప్పుడు నేను తప్పు చేశానని ఒకాయన, నేను తప్పు చేయలేదు వాళ్లిద్దరూ కలిసి నన్ను మోసం చేశారని ఇంకో ఆయన, ఆ ఇద్దరి ఆమోదంతోనే నేను చంపేశాను అని మూడో ఆయన అంటాడు. మన ఖర్మ ఏంటంటే… ఆరు నెలలకోసారి వచ్చి ట్వీట్ చేసే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మనం స్పందించాల్సి రావడం. పవన్ కూడా రాజకీయాల్లో మాట్లాడడం మొదలు పెడితే, దాని గురించి సమాధానం చెప్పాలంటే, నిజంగా ఎక్కడివీ విలువలు!? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండీ తనకు విలువలు? నలుగురు పెళ్లాలు. బహుభార్యత్వం కాదా కొత్త కారును మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకో, ఐదేళ్లకో పెళ్లాన్ని మారుస్తాడు. ఇలాంటి పనిని నేనో నువ్వో మరొకరో చేసి ఉంటే.. ఏమందురు!? నిత్య పెళ్లికొడుకని చెప్పి బొక్కలో వేసేవారా కాదా!? ఇది పాలిగామీ (బహు భార్యత్వం) కాదా? ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినని మాట్లాడడం.. వాళ్లను సీరియ్‌సగా తీసుకుని వాళ్ల గురించి కూడా విశ్లేషించుకోవడం అంటే బాధేస్తుంది’’ అని. జగన్ అన్నారు.

మహా కవి శ్రీశ్రీ ఓ మాటన్నారు. ‘మీ వ్యక్తిగత జీవితాలు మీ ఇష్టం. కానీ ప్రజాజీవితంలోకి వస్తే ప్రశ్నిస్తాం.’ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజా జీవితంలో ఉన్నాడు కనుకే జగన్ ఆయన్ని ప్రశ్నించాడు. జగన్ ప్రశ్నించడంలో తప్పేమీ లేదు. లేనిపోని ఆరోపణలు చేయలేదు కదా ? ఉన్నమాటే అన్నాడు. కళ్లముందు కనిపిస్తున్నదే ప్రశ్నించాడు. వ్యక్తిగత జీవితంలో నచ్చినట్లు ప్రవర్తిస్తాం, రాజకీయ జీవితంలో నీతులు చెప్పేస్తాం అంటే సరిపోతుందా ? నీకు నచ్చినట్లు నచ్చినంత మందిని పెళ్లాడి, రేపు మంత్రివో, ముఖ్యమంత్రివో అయ్యాక, ఏ నిత్యపెళ్లికొడుకు గురించో ఫిర్యాదులు వస్తే నువ్వేం న్యాయం చేస్తావు ? లోకేశ్ చదువుకున్న రోజుల్లో స్విమ్మింగ్ పూల్ వద్ద ఫ్రెండ్స్ తో ఫొటోలు దిగితే, జనసేన ఇప్పటికే రచ్చ చేస్తోందే. విద్యార్ధి దశలో, యువకులుగా ఉన్నప్పుడు అలాంటి సరదాలు కామనే అని తీసుకోవట్లేదే ? తన వరకూ వస్తే కానీ తనకు తెలియదంటారు.

ఇన్నాళ్లూ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని పవన్ టార్గెట్ చేసినా, వాళ్లు భరించారు. ముఖ్యంగా జగన్ చాలా తేలిగ్గా పవన్ వ్యాఖ్యలను తీసుకున్నారు. దీంతో నాడు సోనియానే ఎదిరించిన జగన్ ఎందుకింత మెత్తబడ్డాడు ? ఎందుకు పవన్ రెచ్చిపోతుంటే సైలెంట్ అయిపోతున్నాడు ? జగన్ ధీటుగా సమాధానం చెప్పడం లేదు ఎందుకు ? ఇలాగా మౌనంగా ఉండిపోతే పవన్ మరింత రెచ్చిపోతాడు కదా ? అవిశ్వాసం పెట్టమంటాడు తీరా అధికార, ప్రతిపక్ష పార్టీలు పెడితే పారిపోతాడు. ప్రశ్నిస్తా అంటాడు మోడీ చేసిన మోసంపై అన్నీ మూసుకుని కూర్చుంటాడు. జగన్ ఏ కార్యక్రమం చేపట్టినా తప్పులు పడుతున్నాడు పవన్. ఇలాగే కొనసాగితే పవన్ మరింత రెచ్చిపోయి, వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రమాదముంది. అందుకే జగన్ సరైన సమయంలో పవన్, ఆయన అభిమానులతో పాటు మహిళా సంఘాల కళ్లు తెరిపించేలా ప్రశ్నించాడు. పవన్ ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. తాను వదిలేసిన రేణూ దేశాయ్ తోడు కోసం, పిల్లల రక్షణ కోసం, సామాజిక భద్రత కోసం రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. వారికి భయపడి రేణూ దేశాయ్ ఆఖరికి సోషల్ మీడియాకు దూరంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఇలా తమ నాయకుడు ఏం చేసినా అడిగే వారు లేరని, ప్రశ్నిస్తే చంపేస్తామంటూ బెదిరింపులతో రెచ్చిపోతున్నారు పవన్ ఫ్యాన్స్.

అసలు రేణూ దేశాయ్ కి పవన్ ఎంత భరణం ఇచ్చాడు ? పిల్లల కోసం, వారి చదువులు, భవిష్యత్ కోసం ఏం చేశాడు ? ఏ విధంగా రెండో భార్య అయిన రేణూ దేశాయ్ కి పరిహారం అదజేశాడు ? అసలు ఆమెకు విడాకులు ఇచ్చాకే మూడో పెళ్లి చేసుకున్నాడా ? లేక ముందే తొందరపడ్డాడా ? ఇలాంటి ప్రశ్నలు ఎవరూ పవన్ ను వేయలేదు. ఎందుకంటే ఆయన అభిమానులు దాడి చేస్తారనే భయం. ఇదే అదనుగా ఇన్నాళ్లూ జగన్ ను టార్గెట్ చేసిన పవన్ కు దిమ్మతిరిగే రీతిలో జగన్ ప్రశ్నించాడు. వాస్తవానికి జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ దేశంలో, రాష్ట్రంలో మహిళా సంఘాలు ప్రశ్నించాలి. అంగబలం, అర్ధబలం, అభిమానగణం ఉన్నాయిలే…నన్నెవడు అడుగుతాడులే అని భావిస్తూ…జగన్ చెప్పినట్లు నాలుగైదేళ్లకు ఓ భార్యను మార్చేస్తుంటే… ఇన్నాళ్లూ వ్యక్తిగత జీవితంలే అనే ఊరుకున్నారు. కానీ ఇప్పడు ప్రజా జీవితంలో రోజుకోసారి పవన్ ట్వీట్ చేసేస్తున్నాడు. నీతులు చెప్పేస్తున్నాడు. ఆ నీతులు చెప్పేముందు. ఎదుటివారి చిత్తశుద్ధిని ప్రశ్నస్తూ ట్వీట్ చేసేముందు, తాను నిత్యపెళ్లికొడుకు అవునో కాదో తేల్చాలి. తనను పెళ్లాడి, విడిపోయిన వారికి ఏం న్యాయం చేసాడో ? అసలెందుకు అన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో వివరించాలి. ఆ తర్వాతే ప్రజా జీవితంలో ఇతరులను ప్రశ్నించాలి. లేదంటే నేడు జగన్ ప్రశ్నించినట్లే రేపు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మహిళా ఓటరు పవన్ ను ప్రశ్నస్తుంది. అప్పుడైనా ఆయన సమాధానం చెప్పాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -