Monday, May 20, 2024
- Advertisement -

దాయాదుల ర‌స‌వ‌త్త‌ర‌పోరుకు ఆసియా క‌ప్ రెడీ..

- Advertisement -

క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు మళ్లీ ఆసియా కప్ వచ్చేస్తోంది. దుబాయ్ వేదికగా ఈ ఏడాది సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసింది.

టోర్నీలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ జట్లు పాల్గొంటున్నట్లు ప్రకటించిన ఐసీసీ.. ఒక స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ జట్లు పోటీలో ఉన్నట్లు వెల్లడించింది. టోర్నీలో భాగంగా భారత్ జట్టు సెప్టెంబరు 19న దాయాది పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది.

దాయాదీ దేశం పాకిస్తాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే భారత అభిమానులకు ఎక్కడి లేని ఉత్సాహం వస్తుంది. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడంలేదు. దీంతో ఆ మజాను అభిమానులు ఆ మ‌జాను మిస్సవుతున్నారు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌-పాక్‌లు తలపడుతున్నాయి.

భారత్ , పాకిస్థాన్, ఒక క్వాలిఫయర్‌ జట్టుతో కలిసి గ్రూప్-ఎ‌లో ఉండగా.. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ టీమ్స్ ఉన్నాయి. సెప్టెంబరు 15న శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా.. 28న ఫైనల్‌తో ముగియనుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4కి అర్హత సాధించి.. అందులో టాప్-2లో నిలిచిన జట్లు తుదిపోరులో కప్‌ కోసం ఢీకొంటాయి.

గతేడాది జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఇలాంటి ఆసక్తికర మ్యాచ్‌ ప్రేక్షకులను రెండుసార్లు కనువిందు చేసింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలవగా.. అసలు సిసలు ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌ నెగ్గి టైటిల్‌ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ సారి జ‌రిగే ఆసియాక‌ప్‌లో పాక్‌ను ఓడించి బ‌దులు తీర్చుకుంటారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -