Saturday, May 18, 2024
- Advertisement -

రికార్డ్ సృష్టించిన బన్నీ!

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రకుల్, క్యాథరిన్లు హీరోయిన్స్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కిన చిత్రం సరైనోడు. ఫుల్ లెన్తు మాస్ సినిమాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకేక్కించాడు. గత నెల 22న ప్రక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ని అలరించడంలో ఈ చిత్రం సక్సెస్ అయింది.

అలాగే అదిరిపోయే రెంజ్ లో ఈ చిత్రం కలెక్షన్స్ వసూల్ చేస్తుంది. మొదటి వారంలో నే యాబై కోట్ల మార్క్ ని అందుకొని రికార్డ్ సృష్టించిన బన్నీ తాజాగా 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ల వసూళ్ళ ని సాధించాడు. అలాగే 60 ఓట్లకు పైగా షేర్ సాధించి బయ్యర్లను లాభాల బాటల్లో నిలిపాడు బన్నీ. గతంలో బన్ని నటించిన రేసు గుర్రం చిత్రం ఈ రేంజ్ కలెక్షన్స్ ను కురిపించింది.

మళ్ళి ఇప్పుడు బన్నీ సరైనోడు చిత్రంతో తో రిపీట్ చేశాడు. ఎప్పుడు క్లాస్ ఇమేజ్ ఉన్న సినిమాలు చేసే బన్నీ ఈ చిత్రంలో ఊర మాస్ యాంగిల్ లో తన హై వోల్టేజ్  యాక్షన్ నటన చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నాడు. ఇక దర్శకుడు బోయపాటి కూడా సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ లను ఓ రేంజ్ లో ప్రెసెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -