Tuesday, April 30, 2024
- Advertisement -

బేఫికర్ ఫస్ట్ లుక్!

- Advertisement -

బాలీవుడ్‌లో లిప్‌లాక్‌లు సాధారణమైన అంశం. ముద్దు సన్నివేశాలు లేకుండా ప్రస్తుతం హిందీ సినిమాలు తెరకెక్కడం లేదంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రచారంలో ఈ ముద్దు సన్నివేశాలు ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. తమ సినిమాల్లో ఒకటి, రెండు లిప్‌లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శకనిర్మాతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే బాలీవుడ్ భామ వాణీ కపూర్ హీరో గారి మీద రెచ్చగొట్టే రీతిలో కూర్చొని ఆ హీరో లిప్స్ ని యమా జోరుగా లాక్ చేసి కుర్రకారుని పిచ్చేక్కిస్తోంది . రణ్ వీర్ సింగ్ – వాణీ కపూర్ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”బేఫికర్ ”. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ అఫీషియల్ గా రిలీజ్ అయ్యింది . ఈఫిల్ టవర్ కు దూరంగా ఎత్తైన బిల్డింగ్ మీద ఒకరి ఒడిలో మరొకరు సెక్స్ భంగిమలో కూర్చొని అధర మధురాలను ఆస్వాదించే పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది.

రొమాంటిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కిన ఈ బేఫికర్ పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వాణీ కపూర్ ”ఫ్రెంచ్ కిస్ ” షాట్ అద్భుతంగా వచ్చిందని పేర్కొంది. ఇక రణ్ వీర్ తో కలిసి వాణీ కపూర్ పెట్టిన భంగిమ కూడా కుర్రాళ్ళ మతి పోగొడుతోంది. కథానుగుణంగా ఈ ముద్దు సన్నివేశాలు సినిమాలో కీలకంగా నిలుస్తాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. యష్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -