Friday, April 19, 2024
- Advertisement -

చిన్నప్పటి బన్నీ లవర్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమై అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నాడు.ఈ చిత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు 100వ చిత్రం కావడం విశేషం. 2003లో వచ్చి సంచలన హిట్‌ అందుకున్న గంగోత్రి మూవీకి ఇటీవల18 ఏళ్లు గడిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇందులో నటించిన నటీనటుల గురించి సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో చిన్నారి కావ్య పేరు కూడా మారుమ్రోగుతోంది.

కావ్య అంటే ప్రస్తుతం ఎవరికీ తెలియకపోవచ్చు. గంగోత్రి మూవీలో అల్లు అర్జున్ చిన్నప్పుడు పాడే వల్లంకి పిట్ట..వల్లంకిపిట్టని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది కదా. ఆ పాపే కావ్య, అక్షరాలా తెలుగు అమ్మాయి. ఇక ఈ పాటలో నటించిన చిన్నారి కావ్యకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత బాలు,అడవిరాముడు,అందమైనమనసులో,విజయేంద్రవర్మ మొదలైన సినిమాల్లో బాలనటిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచింది.

Also read:హైపర్ ఆది అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టిన.. దొరబాబు భార్య అమూల్య!

చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన కావ్య త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. కావ్య సినిమా అవకాశాల కోసం ఫొటోషూట్‌, ఆడిషన్స్‌ ఇస్తూ బిజీగా ఉందని ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.ఈ క్రమంలో ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ కావడంతో ఇవి చూసిన ఓ దర్శకుడు ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్యం త్వరలోనే అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదగాలని కోరుకుందాం.

Also read:నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -