Saturday, April 20, 2024
- Advertisement -

భారత్ లో కరోనా బీభత్సం.. 3,82,315 మందికి వైరస్!

- Advertisement -

భారత్‌లో మహమ్మారి రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. కేసులు, మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 3,82,315 కొత్త కోవిడ్-19 కేసులు, 3,780 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 3,38,439 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148కి చేరాయి. ఇండియాలో ప్రస్తుతం 34,87,229 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,26,188 మంది మృతిచెందారు. దేశంలో 16,04,94,188 మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలంగాణలో కొత్తగా 6,631 కరోనా కేసులు వెలుగుచూడగా.. 51 మంది మృతిచెందారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,69,722కు చేరుకుంది. ఇప్పటివరకు 2,572 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 1,225 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 3,89,491 మంది డిశ్చార్జ్ అయ్యారు.

సినీ కార్మికులకు అండగా.. యష్ రాజ్ ఫిల్మ్స్

డాన్ కొడుకుగా సూపర్ స్టార్ మహేష్ బాబు..!

కరోనాని జయించిన సీఎం కేసీఆర్…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -