నాని రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు నేచురల్ స్టార్ నాని. ఫ్యామిలీ ఆడియన్స్ లో యమ క్రేజ్ ఉన్న యువ కథానాయకుడు. నాని అసిస్టెంట్ డైరెక్టర్ ‏గా కెరీర్ ఆరంభించి తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా నాని నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి.నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’ మూవీ నాని కెరీర్‌లో ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు.

తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ, మారుతి దర్శకత్వంలో బలే బలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, ‘జెంటిల్ మెన్, మజ్ను, నేను లోకల్, MCA వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో హీరో నాని ఇండస్ట్రీలో స్టార్ హోదాను పొందాడు. అలాగే కొన్ని అనివార్య కారణాలవల్ల హీరో నాని కొన్ని హిట్ మూవీస్ రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..

- Advertisement -

Also read:ఆ సినిమా రీమేక్ చేస్తే.. బెల్లంకొండ బ్రదర్స్ పరువు పోతుంది..!

నాని వదులుకున్న సూపర్ హిట్ సినిమాలు ..గుండె జారి గల్లంతయ్యిందే, ఉయ్యాల జంపాల,సుప్రీమ్, మహానటి లో (ఏ.ఎన్.ఆర్ పాత్ర) ,సుకుమారుడు ,శ్రీకారం. ఈ సినిమాలో నాని నటించిన ఉంటే ఏ విధంగా ఉండేదని నాని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం నాని “టక్ జగదీష్”,‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే.. సుందరానికీ..’వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా ప్రభావంతో వాయిదా పడింది. మిగిలిన రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు కూడా షూటింగ్ వాయిదా వేసుకున్నట్లు తెలిసిందే.

Also read:లీకైన పుష్ప సినిమా స్టోరీ.. సుకుమార్ ఆ సినిమాను కాపీ కొట్టాడా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -