Friday, May 10, 2024
- Advertisement -

ఇండియా అంతా నాదేనంటున్న బ‌న్నీ

- Advertisement -

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ (డీజే) సినిమాతో విజ‌యం అందుకున్న అల్లు అర్జున్ త‌ర్వాత సినిమాపై బాగా ఆశ‌లు పెట్టుకున్నారు. సైన్యం నేప‌థ్యంలో సినిమాలో న‌టిస్తున్నాడు. ర‌చ‌యిత‌గా ఉన్న వక్కంతం వంశీ దర్శకుడిగా మారి బ‌న్నీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాను దాదాపు ఏడు భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారంట‌.

తెలుగుతో పాటు మలయాళం.. హిందీ భాషల్లోనూ ఈ సినిమాను విడుద‌ల మొదట్నుంచి అనుకుంటున్న‌దే. అయితే ఇప్పుడు ఇంకో నాలుగు భాషల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ వేసుకున్నారు. తమిళం, మరాఠి, బెంగాలీ, భోజ్‌పురి భాషల్లోనూ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను విడుద‌ల చేస్తున్నార‌ని స‌మాచారం. మొత్తంగా ఏడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బన్నీతో మాట్లాడి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారట. బన్నీ కూడా ఓకే చెప్పాడట. ఐతే ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రం ఏప్రిల్ విడుద‌ల తేదీ అందుకుంటుందా అనే సందేహాలు ఉన్నాయి.

ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లగడపాటి శ్రీధర్.. నాగబాబు.. బన్నీ వాసు నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -