Wednesday, May 22, 2024
- Advertisement -

రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే ఫలితాలు…. చంద్రబాబు సర్వే ఫలితాలు ఒకటేనా?

- Advertisement -

రిపబ్లికన్ టివీ, సీ ఓటర్ సర్వేకు భారతదేశంలో చాలా ప్రాధాన్యత ఉంది. రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే ఫలితాలు ప్రతిసందర్భంలోనూ ఎన్నికల ఫలితాలకు దగ్గరగానే వచ్చాయి. లోక్ సభ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బిహార్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలన్నీ కూడా సీ ఓటర్ సర్వే అంచనాలకు తగ్గుట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే ఫలితాలు 2019 ఎన్నికల్లో బిజెపి-టిడిపి పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసినప్పటికీ వైఎస్ జగన్‌కే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని తేల్చేశాయి. అందుకే టిడిపి వర్గాల్లో ఆందోళన మొదలైంది. చంద్రబాబులో కూడా టెన్షన్ కనిపిస్తుండడం టిడిపి వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే పైకి మాత్రం బింకాన్ని ప్రదర్శిస్తూ రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే బూటకం అని ఒక రెగ్యులర్ ప్రకటన వదిలాడు చంద్రబాబు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు చెప్పిన ఇతర మాటలు మాత్రం సీ ఓటర్ సర్వే ఫలితాలకు దగ్గరగా ఉండడం గమనార్హం.

‘40-50 నియోజకవర్గాల్లో టిడిపి బలహీనంగా ఉంది’ అని చంద్రబాబే స్వయంగా చెప్పేశారు. నిన్న మొన్నటి వరకూ 98శాతం సీట్లు మనవే…….ప్రజల్లో 80శాతం మించి సంతృప్తి ఉంది అని ప్రచారం చేయించిన చంద్రబాబే ఇప్పుడు ఏకంగా 50 సీట్లలో టిడిపి బలహీనం అన్న మాట చెప్పడంతో వింటున్న టిడిపి నాయకులు కూడా షాక్ అయ్యారు. సాధారణంగా సొంత సర్వేలు ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువ సానుకూలంగానే ఉంటాయన్నది నిజం. ఆ సర్వే చేసిన వాళ్ళందరూ టిడిపి సానుభూతి పరులే ఉంటారు కనుక ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ పాజిటివ్‌గానే అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో బాబు సొంత సర్వేలోనే 50 స్థానాల్లో టిడిపి బలహీనంగా ఉంది, ఓడిపోతుంది అన్న విషయాలు తేలాయంటే వాస్తవంగా అంతకుమించి అనే స్థాయిలో వ్యతిరేకత ఉందని చెప్పడానికి గొప్ప పాండిత్యం ఏమీ అవసరం లేదు. సీ ఓటర్ లాంటి సర్వేలు కూడా బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ నాట టిడిపికి ఓటమి తప్పదు అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా చంద్రబాబు కూడా 50 స్థానాల విషయంలో చేతులెత్తేయడంతో టిడిపి సీనియర్ నాయకులు కూడా ఆందోళన చెందుతుండడం ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపిస్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -