Monday, May 20, 2024
- Advertisement -

ఐయామ్ ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో

- Advertisement -

క్రేజీ కాంబినేష‌న్‌తో పాటు ఇన్నాళ్లు క‌థా ర‌చయిత‌గా ఉన్న వ్య‌క్తి ద‌ర్శ‌కుడి మార‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల ఫ‌స్ట్ ఇంపాక్ట్ వీడియోతో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ల‌వ‌ర్స్ డే సంంద‌ర్భంగా ఓ పాట‌ను విడుద‌ల చేశారు. దర్శకుడు వక్కంతం వంశీ బ‌న్నీతో తీస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ సినిమా తొలిపాట‌ను సైనికా జ‌న‌వ‌రి 26న గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. ఇప్పుడేమో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఐయామ్ ల‌వ‌ర్ ఆల్సో.. ఫైట‌ర్ ఆల్సో అనే పాట‌ను విడుద‌ల చేశారు.

ఈ సినిమాకు ఆల్రెడీ విశాల్-శేఖర్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. గతంలో వీళ్లిద్ద‌రూ బ‌న్నీ స‌రైనోడు సినిమాలో అతిలోక సుందరి పాట పాడారు. ఇప్పుడు ఈ పాటకు పాడారు. పాటలో కొత్తదనం ఉంది. గొంతులో ఏదో తెలియని కమ్మదనం ఉండ‌డంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. మొత్తం పాట కంపోజిషన్‌లో కూడా ఒక వెరైటీ రిథమ్ దాగి ఉంది. ఈ పాట వీడియో చూస్తుంటే సాంగ్‌లో అల్లు అర్జున్ గెటప్ అదిరిపోయింది. అను ఎమ్మానుయేల్ కూడా హాటుగా కనిపిస్తోంది. వీరి మధ్యన కెమిస్ర్టీని ఈ పాటతో వ‌ర్క‌వుట్ అయ్యేలా ఉంది. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా శేఖ‌ర్ ర‌జ్వియానీ అదో ర‌కం గొంతుతో పాడారు.

నాగ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో శిరీష శ్రీద‌ర్ ల‌గ‌డ‌పాటి, బ‌న్నీ వాసు నిర్మాత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమా వేస‌విలో విడుద‌ల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -