- Advertisement -

ప్రియ‌ద‌ర్శి త‌న‌ ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టాడు

- Advertisement -

సోష‌ల్ మీడియా అనేది ప్ర‌ముఖుల‌కు త‌ప్ప‌నిస‌రి కావాల్సిందే. వారి కెరీర్ అభివృద్ధికి కూడా సోష‌ల్ మీడియా ఒక ర‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్పుడు సోష‌ల్ మీడియా లేని సెలబ్రిటీ ఎవ‌రూ లేరు. మీడియాలో వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకోవ‌డానికి.. సినిమా విష‌యాలు తెల‌ప‌డానికి ఒక వేదికగా ఉంటుంది. అందుకే సోష‌ల్ మీడియా అంటే అంద‌రికీ ఆస‌క్తి. ఏ చిన్న విషయం గురించి చెప్పాలన్నా కూడా సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఇప్పుడు ఒక విష‌యాన్ని పెళ్లిచూపులు ఫేం ప్రియ‌ద‌ర్శి అభిమానుల‌తో పంచుకున్నాడు. అది త‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యం.

పెళ్ళిచూపులు ఫేం కమెడియన్ ప్రియదర్శి కూడా సేమ్ అదే తరహాలో తన ప్రేమ వ్యవహారాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రిచా శర్మ అనే అమ్మాయితో ప్రియ‌ద‌ర్శి ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని వేరే రకంగా చెప్పాడు. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన రిచా శ‌ర్మ పుట్టినరోజు సంద‌ర్భంగా డియర్ లవ్ అంటూ .. ఒక ప్రేమలేఖ రాశాడు. తన డార్లింగ్ రిచా గురించి వ‌ర్ణిస్తూ.. ఎలా ప్రేమిస్తున్నాడో వివ‌రంగా చెప్పాడు.
రిచాశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి ఉన్న ఫొటోపై అంద‌మైన ఫాంట్‌లో త‌న ప్రేమ క‌విత‌ను ఆమె బ‌ర్త్ డే సంద‌ర్భంగా బ‌హిర్గ‌త ప‌రిచాడు.

మొన్న తొలిప్రేమ సినిమాలో అద్భుతంగా న‌టించిన ప్రియ‌ద‌ర్శి ఇక వ్య‌క్తిగ‌త జీవితంలో ఒక మెట్టు ఎక్కేలా క‌నిపిస్తోంది. ప్రేమికుల రోజుకు ఒక్క రోజు ముందు తన ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశాడు. తన ప్రేయసి ఫొటోను పంచుకున్నాడు.

అయితే ఇంకో మాట వినిపిస్తోంది. ఫిబ్రవరి 23వ తేదీన ప్రియదర్శి , రిచా శర్మ పెళ్లి హైదరాబాద్‌లో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -