Wednesday, May 22, 2024
- Advertisement -

బన్నీ స్టార్ ఢం పవర్ అదిరింది……. డైరెక్టర్, హీరోయిన్‌కి క్రేజ్ లేకపోయినా రికార్డ్స్ బ్రేక్

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరుకే చాలా మంది స్టార్ హీరోస్ ఉంటారు. రెమ్యూనరేషన్ మాట్లాడాల్సిన విషయం వచ్చేసరికి మాకు అంత స్టార్ ఢం ఉంది…..ఇంత స్టార్ డం ఉంది అని చెప్తూ పదుల సంఖ్యలో కోట్లు పెంచుకుంటూ పోతారు. మరి ఆ స్థాయి స్టార్ ఢం ఉంటే ఇతర అట్రాక్షన్స్ లేకుండా సినిమాకు క్రేజ్ తీసుకురాగలరా అంటే కళ్ళు తేలేస్తారు. స్టార్ హీరోయిన్స్ ఇద్దరు కావాలి, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి….కమెడియన్స్, విలన్….ఇతర ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ కూడా భారీగా ఉండాలి. లొకేషన్స్ రిచ్‌గా ఉండాలి, బడ్జెట్ అదిరిపోవాలి………ఇంత హంగామా ఉంటే తప్పు సినిమాకు క్రేజ్ తీసుకురాలేరు. ఇన్ని స్పెషల్స్ ఉంటే చిన్న హీరో యాక్ట్ చేసినా కూడా సినిమాకు అంతే రేంజ్ వస్తుంది. కానీ స్టార్ హీరోలను ఆ ప్రశ్న అడిగే ధైర్యం మన నిర్మాతలు చెయ్యరు. అయితే మార్కెట్ లేని డైరెక్టర్స్‌తో సినిమాలు చేసేటప్పుడు మాత్రం మన స్టార్ హీరోల రియల్ మార్కెట్ స్టామినా బయటపడిపోతూ ఉంటుంది.

ఆ లెక్కలు తీస్తే మాత్రం ప్రస్తుతం స్టైలిష్ స్టార్ బన్నీ టాప్ రేంజ్‌లో ఉన్నాడు. నా పేరు సూర్య…..నా ఇళ్ళు ఇండియా సినిమాకు వక్కంతం వంశీలాంటి కొత్త డైరెక్టర్, అజ్ఙాతవాసితో క్రేజ్ కోల్పోయిన హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ సినిమా బిజినెస్ మాత్రం స్కై హైట్స్‌లో సాగుతోంది. కేవలం అల్లు అర్జున్ స్టార్ పవర్‌ని నమ్మి ఈ సినిమాకు 70 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు. అయితే నిర్మాతల నమ్మకాన్ని భారీస్థాయిలో నిలబెట్టుకుంటున్నాడు బన్నీ. కొత్త డైరెక్టర్ అనే విషయంతో సంబంధం లేకుండా ఈ సినిమా నైజాం రైట్స్ 21.5 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకూ నైజాంలో బన్నీ హయ్యెస్ట్ రికార్డ్ ఇదే. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా బన్నీ కెరీర్‌లోనే హయ్యెస్ట్ అనే స్థాయిలో ఈ సినిమా అమ్మకాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు కేరళలో మంచి ఆదరణ ఉంటుంది. బన్నీకి అక్కడ చెప్పుకోదగ్గ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాకు కేరళలో కూడా భారీగా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. దాంతో ఈ సినిమా నిర్మాతలు మాత్రం రిలీజ్‌కి ముందే లాభాలు కళ్ళ చూడడం ఖాయమని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయాలి. అల్లు అర్జున్ అది కూడా సాధించేశాడంటే మాత్రం స్టైలిష్ స్టార్ పవర్ ఏ ఇతర స్టార్ హీరోకూ తగ్గదని, నంబర్ ఒన్ రేసులో బన్నీ కూడా ఉన్నాడని బలంగా చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -