Friday, May 3, 2024
- Advertisement -

2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌నుంచి ఇద్ద‌రు టాప్ స్పిన్న‌ర్లు ఔట్‌…

- Advertisement -

2019 లో జ‌రిగే వ‌ర్ల‌డ్ క‌ప్‌కు భార‌త్ సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టినుంచే జ‌ట్టు కూర్పుపై ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది మేనేజ్‌మెంట్‌. ద‌క్షిణాఫ్రికా టూర్ త‌ర్వాత జ‌ట్టుస‌భ్యుల‌పై ఒక క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌కు ఇద్ద‌రు టాప్ స్పిన్న‌ర్లకు అవ‌కాశం లేద‌నే క‌నిపిస్తోంది. వారిలో భారత్ ఏస్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాల వరల్డ్ కప్ ఆశలు గల్లంతేన‌నిపిస్తోంది.

 2019 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోసం రేస్ నుంచి వారిద్దరూ ఔటైపోయార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.  మాజీ క్రికెటర్ల కొందరి మాటలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాలోని పేస్, బౌన్సీ పిచ్ లపై అద్భుతంగా రాణించి…ఆ గడ్డపై భారత్ కు తొలి విజయాన్ని అందించిన కుల్దీప్ యాదవ్, చాహల్ ద్వయానికే వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప‌లువురు క్రీడాపండితులు అభిప్రాయపడుతున్నారు. 

జట్టు మేనేజ్ మెంట్, సెలక్షన్ కమిటీ కూడా అలాగే భావిస్తున్నాయని అంటున్నారు.  ఎలాంటి వికెట్ పైనైనా తమ మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించగలిగిన యువ స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ యాదవ్ లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్నదే సెలక్షన్ కమిటీ అభిప్రాయంగా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాతో సిరీస్ విజయం తరువాత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాటలను బట్టి చూస్తే కూడా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లకు వరల్డ్ కప్ జట్టులో అవకాశం దాదాపు మృగ్యమేనని చెప్పవచ్చు. 

అయితే భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం జడేజా, అశ్విన్ లకు పూర్తిగా దారులు మూసుకుపోయినట్లు కాదని అంటున్నాడు. కానీ భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ మాత్రం జడేజాకు కానీ, అశ్విన్ కు కానీ అవకాశం దక్కే అవకాశాలు లేవని భావిస్తున్నాడు.  చాహల్, కుల్దీప్ లలో ఎవరో ఒకరు గాయపడితే తప్ప జడేజా, అశ్విన్ లకు 2019 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఎంత మాత్రం లేవని చెబుతున్నాడు. అప్ప‌టి క‌ల్లా జ‌ట్టులో మార్పులు జ‌రిగే అవ‌కాశం లేక‌పోలే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -