- Advertisement -
పుష్ప సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టిందా మూవీ. పూర్తి డీగ్రామరైజ్డ్ పాత్రలో కనిపించిన బన్నీ.. తన నటనతో అదరగొట్టేశాడు. ఇదే ఊపులో పుష్ప 2తో దుమ్మురేపాలని చూస్తున్నాడు. సుకురుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పుల్ స్పీడ్‌గా జరుగుతున్నాయి.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. నడివయసు పాత్రలో బన్నీ కనిపించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ పాత్ర ఒక సీన్ వరకే పరిమితమా.. లేకా చాలాసేపు ఉంటుందా అన్న విషయం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. మొత్తమ్మీద పుష్ప 2లో అల్లుఅర్జున్ పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠరేపుతోంది.
Also Read