మహేశ్‌ మూవీలో తారక రత్న ?

ఫ్యాన్స్‌కు మల్టీస్టారర్ మూవీలు ఇచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం పాన్ ఇండియా కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీస్‌లో మల్టీ స్టార్స్ సందడి చేస్తున్నారు. తాజాగా మహేశ్ బాబు చిత్రంలో నందమూరి తారక రత్న నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసింది.

అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌తో మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీలో నందమూరి హీరో తారకరత్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తారక రత్న పేరుతో ఉన్న ట్విటర్‌ ఖాతా నుంచి #SSMB 28 Loading అంటూ ఓ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశమైంది.

అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పైగా తారకరత్న పేరుతో ఉన్న ట్విటర్ ఖాతా అధికారక పేజీ కాదని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు SSMB 28లో మహేశ్‌ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

విక్రమ్ డైరెక్టర్ తో రామ్ చరణ్

లెక్చరర్ గా పవన్ కల్యాణ్

ఎన్టీఆర్‌ 30 ప్రాజెక్టులో ఆ హీరోయిన్

Related Articles

Most Populer

Recent Posts